మొత్తానికి ఈసంక్రాంతికి కూడా మంచి హిట్ ను అందుకున్నాడు కింగ్ నాగార్జున. సంక్రాంతి తనకు కలిసొస్తుందని మరోసారి ఈసినిమా నిరూపించింది. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయి హిట్లను అందించాయి. ఇక ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలు వచ్చినా అవి సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇప్పుడు నా సామిరంగ సినిమాతో వచ్చాడు. మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ ను ఇచ్చింది. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ వెళుతుంది. మొదటి రోజు కంటే రెండే రోజు ఎక్కువ.. రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అలా రెండు రోజుల్లో ఈసినిమా 17 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా.. మూడు రోజుల్లో ఈసినిమా 24 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మూడో రోజు 3.58 కోట్లు షేర్ ని అందుకోగా మూడు రోజుల్లో ఈ సినిమా 12.46 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. పప్రంచవ్యాప్తంగా 24 కోట్ల షేర్ ను అందుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తంచేస్తుంది. అంతేకాదు అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉన్నట్టు తెలియచేశారు.
Sankranthi KING #NaaSaamiRanga STORM at BO on Kanuma Day!🔥🔥
Total 3 Days WW gross is 24.8 crores💥
Festive celebrations in theatres will continue on Day 4 too🥳#NaaSaamiRangaJaathara
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun… pic.twitter.com/VgMnfMMqU6— Telugu FilmNagar (@telugufilmnagar) January 17, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లన్ హీరోయిన్లుగా నటించగా షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, మధుసూదన్ రావు తదితరులు నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మించారు ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: