హనుమాన్ టీమ్‌ని అభినందించిన నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Congratulated HanuMan Team During The Special Screening

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన తాజా చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బరిలో అగ్రహీరోల చిత్రాలున్నప్పటికీ అద్భుతమైన కంటెంట్‌తో అంచనాలకు మించి హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించి, ఆపై 4వ రోజునే 100 కోట్ల మైలురాయి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్స్ కె. రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ, రామ్ పోతినేని ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రివ్యూ ఇవ్వగా.. తాజాగా మరో సెలబ్రిటీ ఈ లిస్టులో చేరారు.

నందమూరి బాలకృష్ణ తాజాగా ‘హనుమాన్’ సినిమాను వీక్షించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్య కోసం ‘హనుమాన్’ స్పెషల్ షో ప్రదర్శించారు. ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు హీరో తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా హాజరయ్యారు. సినిమాను చూసిన అనంతరం బాలయ్య చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత తక్కువ బడ్జెట్ లో సినిమాను అద్భుతంగా తీశారంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా బాలకృష్ణ, ప్రశాంత్ వర్మ మధ్య మంచి అనుబంధం ఉంది. వీళ్లిద్దరూ గతంలో ‘అన్‌స్టాపబుల్’ షో కోసం పని చేశారు. బాలకృష్ణ హోస్ట్ చేసిన ఈ షో ప్రోమోలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలాగే కొన్ని ఎపిసోడ్స్‌ను కూడా ఆయన డైరెక్ట్‌ చేశారు. దీంతో ప్రశాంత్ వర్మ రిక్వెస్ట్‌ మేరకు ఆయన హనుమాన్ సినిమాను వీక్షించారు. కాగా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో #NBK109 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =