
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 6


జూన్ నుంచి `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్?

RAW ఏజంట్ గా

గోపీచంద్‌కి జోడీగా తమన్నా?

హాలీవుడ్ మూవీ లో రానా ?

వాల్మీకి మూవీ - వరుణ్ సరసన డబ్ స్మాష్ బ్యూటీ!

కంగనాకే సపోర్ట్ అంటున్న సమంత!

వెంకీమామ మూవీలో రానా?

తెలుగు డెబ్యూకి సిద్దపడుతున్న విశాల్!

మరో డిఫరెంట్ రోల్ లో విజయ్ దేవరకొండ?

కపిల్ దేవ్ బయోపిక్ - విజయ్ ప్లేస్ లో జీవా

`ఆర్ ఆర్ ఆర్`లో నాయికలు వారేనా?

తమిళ చిత్రాలతో బిజీ అవుతున్న రాశీ ఖన్నా

నాగచైతన్య ప్లానింగ్ అదుర్స్

యాత్ర మూవీలో జగన్ పాత్ర పై మహి వి రాఘవ్

నాని జెర్సీ కోసం స్టేట్ లెవల్ ప్లేయర్స్

`ఆర్ ఆర్ ఆర్`లో అతిథిగా ప్రభాస్?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్). అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిరియాడిక్ టచ్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో భాగంగా... ఈ పాత్ర వస్తుందని టాక్. ఇదివరకు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన…

జూన్ నుంచి `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్?
కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`. తండ్రీకొడుకులుగా నాగ్ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన ఈ సినిమా... ఆ ఏడాది సంక్రాంతి సినిమాల్లో పెద్ద హిట్ అనిపించుకుంది. కట్ చేస్తే... మళ్ళీ మూడేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఒరిజనల్ వెర్షన్‌ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుండగా... ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు, యువ సామ్రాట్ నాగచైతన్య కూడా నటించనున్నాడు. బంగార్రాజుకి మనవడిగా, రాముకి కొడుకుగా ఈ పాత్ర ఉంటుందని టాక్.

RAW ఏజంట్ గా
AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపి చంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ లో జరుగుతుంది. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1ద్వారా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన ఆదర్శ్ బాలకృష్ణ ఈ మూవీ లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టుకొనే వేటలో RAW ఏజంట్ గా నటిస్తున్నారు.

గోపీచంద్‌కి జోడీగా తమన్నా?
గత ఏడాది విడుదలైన `పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు కథానాయకుడు గోపీచంద్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో... తమిళ దర్శకుడు తిరు రూపొందిస్తున్న ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ని రాజస్థాన్‌లో ప్లాన్ చేసింది యూనిట్. 45 రోజుల పాటు నిరవధికంగా జరిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట ఘట్టాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే... ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఒక నాయికగా బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఎంపికైందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం... ప్రధాన నాయికగా మిల్కీ బ్యూటీ…

హాలీవుడ్ మూవీ లో రానా ?
బాహుబలి సిరీస్ మూవీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి కి హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. కొంతమంది తమ ఇంగ్లిష్ మూవీ లో రానా ను నటింపచేయాలని రానా ను కలిసినట్టు, రానా కు ఉన్న సినిమాల కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తరువాత ఇంగ్లిష్ మూవీ లోనటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

వాల్మీకి మూవీ - వరుణ్ సరసన డబ్ స్మాష్ బ్యూటీ!
ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వరుస విజయాలతో వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇదే స్పీడ్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మికి సినిమాలో నటించబోతున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ నటించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో కూడా వరుణ్ తేజ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న బాబి సింహా పాత్రలో కనిపించనున్నాడు.

కంగనాకే సపోర్ట్ అంటున్న సమంత!
ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కలెక్షన్లు కురిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన కంగనాకు కూడా మంచి పేరొచ్చింది. అందరూ కంగనాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రామ్ ట్వీట్ పై ప్రశంసలు - ఆంధ్రా నాదే తెలంగాణ నాదే
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? అసలు సంగతేంటంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అనంతపురంలో కియా తొలి కారును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. కొద్ది సంవత్సరాల క్రితం...అనంతపురంకు పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు..మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి సాగునీటిని అందించా..దీంతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించగలుగుతాం అని ట్వీట్ చేశారు.

వెంకీమామ మూవీలో రానా?
వెంకీ తన ముద్దుల మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే మల్టీస్టారర్ లో నటించనున్న సంగతి తెలిసిందే. బాబి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్రవరి 21 నుండి మొదలుకానుంది.

తెలుగు డెబ్యూకి సిద్దపడుతున్న విశాల్!
తమిళ స్టార్ హీరో విశాల్ కేవలం తమిళ ప్రేక్షకులకే కాదు...తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో కూడా విశాల్ కు అభిమానులు బాగానే ఉన్నారు. అయితే ఇన్నేళ్లు తమిళంలో సినిమాలు తీసిన విశాల్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు కానీ ఇప్పటివరకూ కుదరలేదు. కానీ ఇప్పుడు ఆ కల నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

2019 జనవరి రిలీజ్ లు-రిజల్ట్ ల సమీక్ష
చూస్తుండగానే 2019 వ సంవత్సరపు తొలి మాసం 'జనవరి' కాల ప్రవాహంలో కలిసి పోయింది. ఊర్లలో కోడి పందేలతో , సినిమా రంగంలో పోటాపోటీ రిలీజ్ లతో సంక్రాంతి మాసం సందడిగా సాగిపోయింది. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారితే సినిమా పందాలలో కోటాను కోట్లు సర్క్యులేట్ అయ్యాయి.

మరో డిఫరెంట్ రోల్ లో విజయ్ దేవరకొండ?
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. `పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో ఘనవిజయాలను అందుకున్న ఈ యూత్ ఐకాన్... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న `డియర్ కామ్రేడ్`తో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు విజయ్.

కపిల్ దేవ్ బయోపిక్ - విజయ్ ప్లేస్ లో జీవా
కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.

`ఆర్ ఆర్ ఆర్`లో నాయికలు వారేనా?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ బడ్జెట్ మల్టీస్టారర్(వర్కింగ్ టైటిల్... `ఆర్ ఆర్ ఆర్`)ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సెమి పిరియాడిక్ డ్రామాకు స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం మలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

తమిళ చిత్రాలతో బిజీ అవుతున్న రాశీ ఖన్నా
`ఊహలు గుసగుసలాడే` (2014)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి... ఆ తరువాత మాత్రం గ్లామర్ రోల్స్‌కే పరిమితమైంది. అయితే... గత ఏడాది ప్రారంభంలో విడుదలైన `తొలిప్రేమ`తో నటిగా మరోసారి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఆ సినిమా తరువాత ఈ టాలెంటెడ్ బ్యూటీ... తెలుగు సినిమాలతో బిజీ అవుతుందనుకుంటే... అనూహ్యంగా తమిళ చిత్రాలతో బిజీ అయిపోయింది.

నాగచైతన్య ప్లానింగ్ అదుర్స్
గత ఏడాది `శైలజా రెడ్డి అల్లుడు`, `సవ్యసాచి` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు నాగచైతన్య... ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ మూడు సినిమాలు కూడా తన కుటుంబ సభ్యుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాలు కావడం. ఆ సినిమాలే... `మజిలీ`, `వెంకీ మామ`, `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్.

ప‌్రత్యేక గీతంలో `ఆర్ ఎక్స్ 100` భామ?
గత ఏడాది బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమాల్లో `ఆర్ ఎక్స్ 100` ఒకటి. చిన్న సినిమాగా విడుదలై... పెద్ద విజయం సాధించిన ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది సోయగం పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే అభినయానికి అవకాశమున్న పాత్రలో కనిపించి... తన అందచందాలతో కుర్రకారుని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం... మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా `డిస్కో రాజా` చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్న పాయల్... ఆ సినిమాలోనూ యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుందని సమాచారం.

యాత్ర మూవీలో జగన్ పాత్ర పై మహి వి రాఘవ్
వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో మహి.వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల 8వ తేదీన (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా రిలీజ్ కూడా దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే మీడియాతో కాసేపు ముచ్చటించిన రాఘవ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

యాత్ర మూవీ - మరుగైనావ రాజన్న లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
మహి వి రాఘవ్ దర్శకత్వంలో.. రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నాని జెర్సీ కోసం స్టేట్ లెవల్ ప్లేయర్స్
క్రికెట్ నేపథ్యంలో వస్తున్న సినిమాల్లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా జెర్సీ కూడా ఒకటి. డియర్ కామ్రేడ్, నాగ చైతన్య మజిలీ సినిమాలు కూడా కొంచెం క్రికెట్ నేపథ్యంలో సాగే కథలే అయినా.. జెర్సీ మాత్రం అవుట్ అండ్ అవుట్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.