
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 7


లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇదే

వెంకీ మామ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్

యాత్ర మూవీ హైలైట్స్

ఈ ప్రేమికుల రోజున రకుల్ `డబుల్ ధమాకా`

`ఆల్ ఈజ్ వెల్` అంటున్న సతీష్ వేగేశ్న

మాస్ మహరాజ్ కి ఈ `రాజా` కూడా కలిసొస్తాడా?

నాగచైతన్య దర్శకుడితో శర్వానంద్?

`ఆర్ ఆర్ ఆర్`లో బాలీవుడ్ భామ?

ఎఫ్2 నుండి ప్రేక్షకులకు మరో సర్ ప్రైజ్

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్

సూర్యకాంతం టీజర్ రిలీజ్

100కోట్ల క్లబ్ లో F2 మూవీ

బన్నీతో మరోసారి అలాగే...

బాలీవుడ్ రెబల్ స్టార్ కంగన రనౌత్

సూర్యకాంతం టీజర్ వచ్చేస్తుంది

అల్లుడితో సందడి చేయడానికి రెడీ అవుతున్న మామ
విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దర్శక నిర్మాతలకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే ఫామ్ లో వెంకీ మరో మల్టీస్టారర్ కు రెడీ అయిపోతున్నాడు. కె యస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వెంకీ, నాగచైతన్య కాంబినేషన్ లో వెంకీమామ అనే మల్టీస్టారర్ తెరెకెక్కనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇదే
ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. సినిమాను మార్చిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వర్మ. అయితే ఈ లోపు తను ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన ఫొటోలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించి ఫొటోలు పెడుతూ పేర్లు చెప్పకుండా ఆ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు.

వెంకీ మామ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్
బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్ సహకారం తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, బ్లాక్ బస్టర్ మూవీ జై లవకుశ దర్శకుడు కె యస్ రవీంద్ర దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందనున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. రియల్ జీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేష్, నాగ చైతన్య లు రీల్ జీవితం లో మేనమామ, మేనల్లుడు గా వెంకీ మామ మూవీ లో నటించడం విశేషం.

యాత్ర మూవీ హైలైట్స్
పలు సంక్షేమ పథకాలతో ప్రజాదరణ పొంది, జనరంజక పాలనచేసి, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహా నేత, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మహేష్ వి రాఘవ్ దర్శకత్వంలో స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా రూపొందిన యాత్ర మూవీ ఫిబ్రవరి 8వ తేదీ తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. 1500KM పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకున్న YSRబయోపిక్ మూవీ రాజకీయ చిత్రంతో పాటు హ్యూమన్ డ్రామా కలగలిపిన చిత్రం యాత్ర అని దర్శకుడు మహి తెలిపారు.

ఈ ప్రేమికుల రోజున రకుల్ `డబుల్ ధమాకా`
రకుల్ ప్రీత్ సింగ్... ఈ తరం ప్రేక్షకుల కలల రాణి. దక్షిణాదిలోనే కాదు... హిందీ పరిశ్రమలోనూ తనదైన శైలితో ముందుకు సాగుతోందీ స్టన్నింగ్ బ్యూటీ. ఈ ఏడాదిలో వరుస చిత్రాలతో సందడి చేయబోతున్న ఈ ముద్దుగుమ్మకి... ఈ వాలంటైన్స్ డే వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే... అదే రోజు కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తితో కలసి `డబుల్ ధమాకా` ఇవ్వబోతోంది రకుల్.

`ఆల్ ఈజ్ వెల్` అంటున్న సతీష్ వేగేశ్న
`శతమానం భవతి`(2017)తో తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ సినిమా... పలు పురస్కరాలను అందుకుంది. దర్శకుడిగా సతీష్‌కు ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. అయితే... `శతమానం భవతి` తరువాత సతీష్ రూపొందించిన మరో ఫ్యామిలీ డ్రామా `శ్రీనివాస కళ్యాణం` ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో... తదుపరి చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి రావడానికి మరో ఎమోషనల్ డ్రామాని ఎంచుకున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. `ఆల్ ఈజ్ వెల్` పేరుతో రూపొందనున్న ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్…

మాస్ మహరాజ్ కి ఈ `రాజా` కూడా కలిసొస్తాడా?
మాస్ ఎంటర్‌టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుల్లో మాస్ మహరాజ్ రవితేజ ఒకరు. తన శైలి నటనతో... బ్యాంకబుల్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో... కెరీర్‌లో సింహభాగం విజయాలను అందుకున్నాడు. అయితే... గత కొంతకాలంగా రవితేజ కెరీర్ గ్రాఫ్ ఏమంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఒక దశలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన... కొన్ని రొటీన్ సినిమాలతో అనూహ్యంగా అపజయాల బాట పట్టాడు. అయితే... డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో తెరకెక్కిన `రాజా ది గ్రేట్`తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేశాడాయన. ఇందులో అంధుడి పాత్రలో రవితేజ అభినయం అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను…

నాగచైతన్య దర్శకుడితో శర్వానంద్?
యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా వేసవిలో విడుదల కానుండగా... తమిళ బ్లాక్‌బస్టర్ `96`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది. ఈ రెండు సినిమాల తరువాత మరో ఆసక్తికరమైన సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

`ఆర్ ఆర్ ఆర్`లో బాలీవుడ్ భామ?
తెలుగు నాట చాలా కాలం తరువాత సిసలైన మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. అదే `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ అధినేత డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా... ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా... తాజాగా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది.

ఎఫ్2 నుండి ప్రేక్షకులకు మరో సర్ ప్రైజ్
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఎఫ్ 2 సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సీత ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
సినిమా జయాపయాల సంగతి పక్కన పెడితే వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రీసెంట్‌గా ‘కవచం’ చిత్రంతో వచ్చిన సాయి శ్రీనివాస్ కు ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం సాయి తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కాజల్ అగర్వాలే సాయి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

లేటెస్ట్ మూవీస్ కలెక్షన్స్
కొత్త ఏడాది మొదలైపోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మొదలైపోయింది. ఎన్టీఆర్ కథానాయకుడితో ఈ సందడి ప్రారంభమవ్వగా... ఇప్పటివరకూ చాలా సినిమాలే రిలీజయ్యాయి. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజవ్వగా... ఎఫ్ 2 విజేతగా నిలిచింది. ఇక ఈరోజు అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్ మజ్ను సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

సూర్యకాంతం టీజర్ రిలీజ్
ఒక మనసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నిహారిక ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకొని మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటించి మరోసారి అలరించింది. అయితే ఆ సినిమా అంతగా అలరించలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ప్రణీత్ దర్శకత్వంలో నిహారిక సూర్యకాంతం అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఖచ్చితంగా మంచిగానే ఉండబోతుందన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.


లెజెండరీ డైరెక్టర్ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాంస్య విగ్రహావిష్కరణ
శతాధిక చిత్రాలు, దశాధిక రంగాలు, దశముఖ ప్రతిభా విశేషాల సినీ శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అనూహ్య, ఆకస్మిక మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.2017 మే 30 వ తేదీన ఆ దర్శక దిగ్గజం పరమపదించారు. అటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, ఇటు తెలుగు ప్రజానీకం మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావు స్వస్థలం పాలకొల్లు. దాసరి నారాయణ రావు తో పాటు ఎందరెందరో సినీ దిగ్గజాల పురిటిగడ్డ పాలకొల్లు. అందుకే పాలకొల్లులో పుట్టి ఆ ఊరికే గర్వకారణంగా నిలిచిన ప్రముఖుల విగ్రహాలను ఆ పట్టణం నడిబొడ్డున ప్రతిష్టించారు. ఇప్పుడు తాజాగా శతాధిక చిత్ర దర్శకుడిగా…

100కోట్ల క్లబ్ లో F2 మూవీ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన మల్టీ స్టారర్ F2 ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో నెంబర్ 1 గా F2 మూవీనిలిచింది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన F2 మూవీ ప్రేక్షకాదరణ పొంది, 2వారాలలోనే 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.

బన్నీతో మరోసారి అలాగే...
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఫిబ్రవరి 14న పట్టాలెక్కనుందని సమాచారం. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో... బన్నీకి జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు... `జులాయి`లో ఇలియానా, `సన్నాఫ్ సత్యమూర్తి`లో సమంత ఎలాగైతే తొలిసారిగా…

బాలీవుడ్ రెబల్ స్టార్ కంగన రనౌత్
సూపర్ హిట్ మూవీ గ్యాంగ్ స్టర్ తో బాలీవుడ్ లో ఎంటరయిన కంగన రనౌత్ నటించిన ఫ్యాషన్, రాజ్, కైట్స్, తను వెడ్స్ మను, క్రిష్3 , క్వీన్, సిమ్రన్ సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను చిత్రాలకు బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్స్ కంగన సొంతం చేసుకున్నారు. గాడ్ ఫాదర్ లేకుండా, ఓపెన్ గా మాట్లాడుతూ కంగన రెబల్ స్టార్ అనిపించుకున్నారు. బ్రిటిష్ సేనను ఎదిరించి, పోరాడిన వీర వనితఝాన్సీ రాణి లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీలో కంగన రాణి లక్ష్మీ బాయ్ గా నటించారు.

సూర్యకాంతం టీజర్ వచ్చేస్తుంది
నాన్న కూచి వెబ్ సిరీస్ దర్శకుడు ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంట గా సూర్యకాంతం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

యాత్ర మూవీ - యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో అతి కీలకమైన ఘట్టం పాదయాత్ర. ఈ పాదయాత్ర నేపథ్యాన్నే తీసుకొని యాత్ర అనే పేరుతో మహి.వి రాఘవ సినిమాను తెరకెక్కించారు. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ నటించగా, కీలక పాత్రల్లో జగపతిబాబు, పోసానీ, సుహాసిని, అనసూయ పలువురు నటిస్తున్నారు. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా...ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 70 ఎంఎం ఎంటెర్టైనమెంట్ పథకం పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు.