త‌మిళ చిత్రాల‌తో బిజీ అవుతున్న రాశీ ఖ‌న్నా

Raashi Khanna Busy With Tamil Projects,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Actress Raashi Khanna Busy With Kollywood Projects,Raashi Khanna Busy With Tamil Movies,Raashi Khanna New Movies Latest News,Raashi Khanna Upcoming Films
Raashi Khanna Busy With Tamil Projects

`ఊహ‌లు గుస‌గుస‌లాడే` (2014)తో తెలుగు తెర‌కు కథానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా. మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి… ఆ త‌రువాత మాత్రం గ్లామ‌ర్ రోల్స్‌కే ప‌రిమిత‌మైంది. అయితే… గ‌త ఏడాది ప్రారంభంలో విడుద‌లైన `తొలిప్రేమ‌`తో న‌టిగా మ‌రోసారి మెప్పించిందీ ముద్దుగుమ్మ‌. ఆ సినిమా త‌రువాత ఈ టాలెంటెడ్ బ్యూటీ… తెలుగు సినిమాల‌తో బిజీ అవుతుంద‌నుకుంటే… అనూహ్యంగా త‌మిళ చిత్రాల‌తో బిజీ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోలీవుడ్‌లో`ఇమైక్క నోడిగ‌ళ్‌`, `అడంగ మారు` చిత్రాల‌తో గ‌త ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న రాశి… అతి త్వ‌ర‌లో `అయోగ్య‌` (`టెంప‌ర్‌` రీమేక్‌), `సైతాన్ కా బ‌చ్చా` సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. అంతేకాదు… విజ‌య్ సేతుప‌తి, శింబు వంటి క్రేజీ స్టార్స్ సినిమాల్లోనూ హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మ ద‌క్కించుకుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్త‌మ్మీద‌… త‌మిళ చిత్ర‌సీమ‌లో రాశి బాగానే రాణిస్తుంద‌నే చెప్పాలి.

ఇక తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే… గ‌త ఏడాది ద్వితీయార్ధంలో `శ్రీ‌నివాస క‌ళ్యాణం`తో ప‌ల‌క‌రించిన రాశి… ప్ర‌స్తుతం యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జంట‌గా క్రాంతి మాధ‌వ్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. చూస్తుంటే… ఈ ఏడాది రాశికి బాగానే వ‌ర్క‌వుట్ అయ్యేలా ఉంది. ఆల్ ది బెస్ట్ టు టాలెంటెడ్ బ్యూటీ రాశి!

[subscribe]

[youtube_video videoid=QIam1ccIb6c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 18 =