క్రికెట్ నేపథ్యంలో వస్తున్న సినిమాల్లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా జెర్సీ కూడా ఒకటి. డియర్ కామ్రేడ్, నాగ చైతన్య మజిలీ సినిమాలు కూడా కొంచెం క్రికెట్ నేపథ్యంలో సాగే కథలే అయినా.. జెర్సీ మాత్రం అవుట్ అండ్ అవుట్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు మరో ఆసక్తిరమైన పని చేస్తున్నారు. అదేంటంటే… క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న కథ కాబట్టి.. సినిమా కోసం ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్స్ ను తీసుకుంటున్నారట. ఎక్కడా ఛాన్స్ తీసుకోకూడదని… సిటీ మరియ స్టేట్ లెవల్ లో ఉన్న ప్లేయర్స్ ను తీసుకుంటున్నారట. మరి స్టేట్ లెవల్ ప్లేయర్స్ అంటే ఆ కిక్ వేరే ఉంటుంది. మొత్తానికి ఓ మంచి మ్యాచ్ ను చూపించబోతున్నారన్నమాట. చూద్దాం ఏ రేంజ్ లో ఉంటుందో మరి..
కాగా మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్.
[youtube_video videoid=Rl6T0bM94Qs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: