చూస్తుండగానే 2019 వ సంవత్సరపు తొలి మాసం ‘జనవరి’ కాల ప్రవాహంలో కలిసి పోయింది. ఊర్లలో కోడి పందేలతో , సినిమా రంగంలో పోటాపోటీ రిలీజ్ లతో సంక్రాంతి మాసం సందడిగా సాగిపోయింది. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారితే సినిమా పందాలలో కోటాను కోట్లు సర్క్యులేట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే కోడిపందాలలో వడ్డిన కోట్లకు జమా లెక్కలు ఉండవు. కానీ సినిమా పందాలలో గెలుపోటములకు జమా లెక్కలు ఉంటాయి. సంక్రాంతి బరిలో దిగిన భారీ సినిమాలతో పాటు వాటికి ముందు వెనుకగా రిలీజ్ అయిన చోటామోటా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో, మాసాంతపు సమీక్షల్లో లాభనష్టాల లెక్కలు చూసుకోవలసిన సమయమిది.
అలా చూసుకోవాలి అంటే అసలు జనవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో తెలియాలి. అయితే నిజానికి అందరికీ తెలిసినవి, అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాలు 5 మాత్రమే.
అవి ఎన్టీఆర్ కథానాయకుడు,పేట, వినయ విధేయ రామ ,ఎఫ్ 2,మిస్టర్ మజ్ను … ఇవే కదా రిలీజైంది !
జనవరి 9న విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడే కదా 2019 లో విడుదలైన తొలి చిత్రం అనుకుంటున్నారు చాలామంది. కానీ జనవరి 4న నటన, అజయ్ పాసయ్యాడు, కొత్త కుర్రాడు, రాఘవ అనే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అలాగే జనవరి 25న ముద్ర, కొత్తగా మా ప్రయాణం అనే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఈ పెద్ద సినిమాల మధ్య తమ ఉనికిని కూడా చాటుకోలేక పోయాయి ఆ సినిమాలు. అలాగే జనవరి 4న లేడీ టైగర్, రణరంగం, బంబుల్ బీ, జనవరి 10న” పేట” జనవరి 18న” యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్”, జనవరి 25న” మణికర్ణిక” అనే ఆరు డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. అంటే మొత్తం జనవరి నెలలో 10 స్ట్రైట్ చిత్రాలు, 6 డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొత్తం 16 చిత్రాలు విడుదలయ్యాయి.
ఇక ఈ 16 చిత్రాల జయాపజయాలను సమీక్షించుకుంటే చాలా బాధాకరమైన ఫలితాలు కళ్లముందు కదలాడతాయి. పేరుకు 16 చిత్రాలు విడుదలైనప్పటికీ వాటిలో నాలుగు స్ట్రెయిట్ చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ,ఎఫ్ 2, మిస్టర్ మజ్ను ఒక డబ్బింగ్ చిత్రం పేట మాత్రమే జనం దృష్టిలో పడ్డాయి. మిగిలిన 11 చిత్రాలు రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. వీటిలో ‘మణికర్ణిక’ ఒరిజినల్ హిందీ వెర్షన్ బాగానే ఆడుతున్నప్పటికీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ నిరాశ పరుస్తుంది. కాబట్టి ‘పేట’తో కలుపుకొని రేసులో నిలిచినవి 5 చిత్రాలు మాత్రమే. ఈ ఐదు చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఎన్టీఆర్ కథానాయకుడు:
ముందుగా జనవరి 9న విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడు” టాక్ బాగున్నప్పటికీ రెవిన్యూ పరంగా చాలా నిరాశ పరిచింది. నిర్మాణ దశలోనూ, ప్రీ రిలీజ్ దశలోను విపరీతమైన అంచనాలను ఏర్పరచుకున్న ఈ బయోపిక్ రిలీజ్ తరువాత టాక్ పరంగా చాలా బాగుంది అనిపించుకున్నప్పటికీ ఆశ్చర్యకరంగా రెవెన్యూ విషయంలో చాలా బాధాకరమైన ఫలితాలను ఇచ్చింది . నిర్మాతలే ఎక్కువ ఏరియాలు రిలీజ్ చేసుకున్నప్పటికీ దాదాపు 70 కోట్ల ప్రీ రిలీజ్ వాల్యూ కలిగిన ఈ సినిమా మొదటి తొమ్మిది రోజులకు కేవలం 20 కోట్ల షేర్ మాత్రమే సాధించటంతో ఫిలిం ట్రేడ్ షాక్ అయింది. వచ్చిన టాక్ కు వస్తున్న రెవెన్యూకు సంబంధంలేని ఫలితాన్నిచ్చిన “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రాన్ని మోరల్ హిట్ గా, రెవిన్యూ ఫ్లాప్ గా చెప్పుకోక తప్పదు.
పేట :
ఇక జనవరి 10 న స్ట్రైట్ చిత్రాలకు ధీటైన అంచనాలతో విడుదలైన రజినీకాంత్ ‘ పేట’ కూడా డిజప్పాయింట్ చేసింది. టాక్ పరంగా కొంత బెట్టర్ అనిపించుకున్నప్పటికీ రెవిన్యూ ఆ స్థాయిలో లేదు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా రజనీకాంత్ కు ఉన్న చరిష్మా ఈ సినిమాకు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. నిజానికి సినిమా టూ సినిమా రజనీకాంత్ మేజిక్ అండ్ మెస్మరిజాలు డ్రాప్ అవుతున్నాయి అనటానికి కొచ్చాడియన్, కబాలి, కాలా,2.0 ,పేట చిత్రాల రిజల్ట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వినయ విధేయ రామ :
జనవరి 11న స్కై టచ్చింగ్ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన రాంచరణ్- బోయపాటిల కాంబో “వినయ విధేయరామ” తొలి రోజు తొలి షో నుండే విపరీతమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎంత కమర్షియల్ సినిమా అయినప్పటికీ మరీ ఇంతగా నేల విడిచి సాము చేసినట్లు నమ్మశక్యం కాని యాక్షన్ సీక్వెన్స్ ను conceive చేయటం పట్ల విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్నాడు దర్శకుడు బోయపాటి. నిజానికి ఈ సినిమాపై వచ్చిన విమర్శల విషయంలో అందరిది ఏకాభిప్రాయమే. ఇది ఒక మిస్ ఫైర్డ్ యాక్షన్ యటెంప్ట్ అనటంలో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ కు అవకాశం లేదు. అయితే ఈ నెగిటివ్ టాక్ కు , ఈ సినిమా మొదటి 10 రోజుల్లో సాధించిన రెవిన్యూ కు సంబంధమే లేదు. ఇంత నెగిటివ్ టాక్ ను మూటగట్టుకున్న ఒక సినిమాకు రెవిన్యూ పరంగా కూడా అట్టర్ ఫ్లాప్ అనే రిజల్ట్ రావాలి. కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా 10 రోజుల్లో దాదాపు 62 కోట్ల షేర్ రాబట్టటం చూసి ట్రేడ్, ఆశ్చర్యపోయింది. ఇంత నెగిటివ్ టాక్ లో కూడా ఇంత రెవిన్యూ రావటాన్ని కేవలం హీరో స్టామినా గా భావిస్తుంది ట్రేడ్. నిజానికి ఈ సినిమాను 50 నుండి 60 కోట్ల హెల్దీ బడ్జెట్లో చేసి ఉంటే టాక్ ఎలా ఉన్నప్పటికీ రెవిన్యూ పరంగా ప్రతి ఒక్కరు లాభపడి ఉండేవారు. కానీ హద్దులు మీరుతున్న నిర్మాణ వ్యయం కారణంగా ఈ సినిమాను మరికొన్ని ఇదే ధోరణిలో సాగుతున్న సినిమాలను “కాస్ట్ ఫెయిల్యూర్స్” గా చెప్పక తప్పదు. కేవలం 10 రోజుల్లో 65 కోట్లు దగ్గర దగ్గరగా షేర్ సాధించిన సినిమాను ఫ్లాప్ అనే గాట కట్టుకునే పరిస్థితిలో ఉన్నామంటే మన చిత్ర నిర్మాణ ధోరణులు ఎంత అనారోగ్యకరంగా సాగుతున్నాయో ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ టాక్ పరంగా, బయ్యర్స్ రిటర్న్స్ పరంగా ” వినయ విధేయ రామ” ను ఒక ఫెయిల్యూర్ సినిమా గానే చెప్పుకోవాలి.
ఎఫ్ 2:
జనవరి 12న విడుదలైన “ఎఫ్ 2” ఫలితం అందరికీ తెలిసిందే. రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసి పంపడమే సినిమా లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సాధించిన షీర్ ఎంటర్టైనర్ గా నిలిచింది ఎఫ్ 2. సినిమా అన్నది ఒక లాజిక్ లెస్ మేజిక్ అనుకుంటే అలాంటి మేజిక్ తో ప్రేక్షకుల పొట్టచెక్కలు చేసి పంపిన “ఎఫ్ 2” 2019 వ సంవత్సరపు తొలి విజయంగా, ఘనవిజయంగా నిలిచింది. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి ల కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది ఎఫ్2. నిజానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ – సెకండ్ హాఫ్ ల మధ్య చాలా డివైడ్ టాక్ ఉంది. అయితే ఫస్టాఫ్ లో నవ్విన నవ్వులే మాకు చాలు.. అంటూ సెకండాఫ్ తాలూకు డ్రాపింగ్ ను ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఎస్క్యూస్ చేశారు. కాబట్టి కేవలం ఫస్టాఫ్ strength తో ఒక సినిమా ఈ స్థాయి హిట్ అవటాన్ని కూడా గొప్ప విశేషంగా చెప్పుకోవాలి.
మిస్టర్ మజ్ను :
జనవరి 25న విడుదలయిన “మిస్టర్ మజ్ను” మరోమారు అక్కినేని అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి.” తొలిప్రేమ” చిత్రంతో ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్ గా అద్భుతమైన టేకాఫ్ తీసుకున్న వెంకీ అట్లూరి ‘second film syndrome’ నుండి తప్పించుకోలేకపోయాడు… and so is the result of Mr. Majnu.
ఇవి 2019 సంవత్సరపు తొలి మాసమైన జనవరి నెల ఫలితాలు. రిలీజ్ అయిన16 చిత్రాలలో కేవలం ఒకే ఒక చిత్రం “ఎఫ్2” హిట్ అవటం… మిగిలిన చిత్రాలలో కొన్ని మిశ్రమ ఫలితాలను, కొన్ని దారుణ ఫలితాలను ఇవ్వటంతో “2019 తొలి టాప్ చైర్ ప్రొడ్యూసర్” గా నిలిచారు దిల్ రాజు.
[youtube_video videoid=vD2b_Z9GEYU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: