యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్). అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిరియాడిక్ టచ్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో భాగంగా… ఈ పాత్ర వస్తుందని టాక్. ఇదివరకు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన `ఛత్రపతి`, `బాహుబలి` సిరీస్… ప్రభాస్‌కు కథానాయకుడిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… రాజమౌళి అడిగిన వెంటనే ప్రభాస్ కూడా ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో అతిథిగా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే… ప్రభాస్ ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది. 2020 వేసవిలో `ఆర్ ఆర్ ఆర్` తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: