యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ బడ్జెట్ మల్టీస్టారర్(వర్కింగ్ టైటిల్… `ఆర్ ఆర్ ఆర్`)ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సెమి పిరియాడిక్ డ్రామాకు స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం మలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇప్పటివరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ మధ్య దక్షిణాది భామల పేర్లు ఈ సినిమా కోసం ప్రముఖంగా వినిపించినా… ఇప్పుడు మాత్రం ఇద్దరు బాలీవుడ్ భామలు ఇందులో కథానాయికలుగా నటించే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్‌కి జోడీగా ప్రియాంకా చోప్రా సోదరి, ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నటిస్తుందనే వార్తలు రాగా… తాజాగా మరో హిందీ నటి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ హిందీ దర్శకుడు మహేష్ భట్ తనయ, సెన్సేషనల్ హీరోయిన్ అలియా భట్.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇప్పటికే అలియాతో రాజమౌళి సంప్రదింపులు జరిపాడని… అలాగే అలియా మెంటర్ కరణ్ జోహార్ కూడా మరో ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించమని సలహా ఇచ్చాడని టాక్. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో మార్కెటింగ్ దృష్ట్యా బాలీవుడ్ భామల వైపే `ఆర్ ఆర్ ఆర్` యూనిట్ మొగ్గు చూపిస్తుందని సమాచారం. త్వరలోనే అలియా ఎంట్రీపై క్లారిటీ రావచ్చు. అన్నీ కుదిరితే యన్టీఆర్ కి జోడీగా అలియా జట్టు కట్టే అవకాశం పుష్కలంగా ఉందనే చెప్పాలి. 2020 వేసవిలో `ఆర్ ఆర్ ఆర్` తెరపైకి రానుంది.
[youtube_video videoid=5oGd04I7hYY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)