రామ్ ట్వీట్ పై ప్రశంసలు – ఆంధ్రా నాదే తెలంగాణ నాదే

Ram Pothineni Tweet Goes Viral,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Hero Ram Tweet Goes Viral,Ram Pothineni Latest Updates,Ram Pothineni Latest News,Ram Pothineni Responds To Negative Comments in Twitter
Ram Pothineni Tweet Goes Viral

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? అసలు సంగతేంటంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అనంతపురంలో కియా తొలి కారును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. కొద్ది సంవత్సరాల క్రితం…అనంతపురంకు పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు..మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి సాగునీటిని అందించా..దీంతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించగలుగుతాం అని ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్వీట్ పై రామ్ స్పందిస్తూ…‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు. ముందు ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సలు లేదు. ముందు నేను పౌరుడిని.. ఆ తర్వాతే నటుడిని’ అంటూ ట్వీట్ చేశారు. ఇక దీంతో రామ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి మద్దతు తెలుపుతున్న ఏకైక టాలీవుడ్ హీరో రామ్ అంటూ పలువురు అభినందిస్తున్నారు.

 

[subscribe]

[youtube_video videoid=nrQgHxNKrcQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 8 =