గత ఏడాది బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమాల్లో `ఆర్ ఎక్స్ 100` ఒకటి. చిన్న సినిమాగా విడుదలై… పెద్ద విజయం సాధించిన ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది సోయగం పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే అభినయానికి అవకాశమున్న పాత్రలో కనిపించి… తన అందచందాలతో కుర్రకారుని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం… మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా `డిస్కో రాజా` చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తున్న పాయల్… ఆ సినిమాలోనూ యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక గీతంలో నర్తించేందుకు పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… సంచలన దర్శకుడు తేజ డైరెక్షన్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో `సీత` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందని… ఆ పాట కోసం ఇటీవల చిత్ర యూనిట్ పాయల్‌ను సంప్రదించిందని… పాట కాన్సెప్ట్ నచ్చడంతో పాయల్ కూడా ఈ స్పెషల్ సాంగ్ చేసేందుకు సానుకూలంగా స్పందించిందని టాక్. త్వరలోనే పాయల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా… వేసవి కానుకగా `సీత` తెరపైకి రానుంది.
[youtube_video videoid=KIIrIY7G6j4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: