వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. `పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`, `టాక్సీవాలా` చిత్రాలతో ఘనవిజయాలను అందుకున్న ఈ యూత్ ఐకాన్… ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న `డియర్ కామ్రేడ్`తో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు విజయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… క్రాంతి మాధవ్ చిత్రంలో విజయ్ ప్లే బోయ్ క్యారెక్టర్ చేయబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే… తాజా సమాచారం ప్రకారం ఇందులో విజయ్ సింగరేణి కార్మికుడి పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. ప్రస్తుతం కొత్తగూడెంలో ఈ సినిమా తాలూకు చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. మరి… విజయ్ పోషిస్తున్న కార్మికుడి పాత్ర కొన్ని సన్నివేశాలకే పరిమితమా? లేదంటే పూర్తిస్థాయి పాత్రగా అది ఉంటుందా? అలాగే ప్లే బోయ్ షేడ్స్ కూడా ఆ పాత్రకి ఉంటాయా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్‌కి జోడీగా రాశి ఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=u0f3s5QJZg8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: