కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడంటూ కొద్ది రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆవార్తలను విజయ్ దేవరకొండ కొట్టిపారేశాడు. తాను ఆ సినిమాలో చేయడం లేదని చెప్పేశాడు. ఇక విజయ్ దేవరకొండ ప్లేస్‌లో జీవా నటించనున్నాడన్న టాక్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ బయోపిక్ లో శ్రీకాంత్ పాత్రలో జీవా నటించనున్నాడు. మరి కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న జీవాకి ఈ చిత్రం మంచి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం.
కాగా 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: