గత ఏడాది విడుదలైన `పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు కథానాయకుడు గోపీచంద్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో… తమిళ దర్శకుడు తిరు రూపొందిస్తున్న ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. కాగా… ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ని రాజస్థాన్‌లో ప్లాన్ చేసింది యూనిట్. 45 రోజుల పాటు నిరవధికంగా జరిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట ఘట్టాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఒక నాయికగా బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఎంపికైందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… ప్రధాన నాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకు గోపీచంద్, తమన్నా జంటగా నటించనేలేదు. మొదటిసారిగా ఈ ఇద్దరూ కలసి నటించనున్న ఈ సినిమా… దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: