వెంకీ తన ముద్దుల మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే మల్టీస్టారర్ లో నటించనున్న సంగతి తెలిసిందే. బాబి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్రవరి 21 నుండి మొదలుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో రానా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాబాయ్ తో కలిసి ఎప్పటినుండో రానా నటించాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా బయటపెట్టాడు. దీంతో ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించేలా ప్లాన్ చేశారట. మరి దీనిపై క్లారిట రావాలంటే మాత్రం అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.
కాగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా, వెంకీ పక్కన శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లు వినబడుతున్నాయి. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. సురేష్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా ఎఫ్2 రేంజ్ లో ఉంటుందో? లేదో? మామ అల్లుళ్లు ఎంత సందడి చేస్తారో చూద్దాం?
[youtube_video videoid=YGvYS-pTa3Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: