వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో మహి.వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల 8వ తేదీన (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా రిలీజ్ కూడా దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే మీడియాతో కాసేపు ముచ్చటించిన రాఘవ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో జగన్ పాత్ర ఉంటుందా? లేదా అన్న డౌట్ కు ఓ క్లారిటీ ఇచ్చారు రాఘవ్. యాత్ర సినిమాలో జగన్ పాత్ర ఉంటుందా అన్న ప్రశ్నకు స్పందించిన రాఘవ్… ఈ సినిమాలో జగన్ పాత్ర లేదు.. స్క్రిప్ట్ లో వుంది కానీ నేనే తరువాత తీసేశాను… ఆయన పాత్ర పెడితే బిజినెస్ పరంగా ఉపయోగపడుతుంది కానీ ఎమోషనల్ కథలో ఓక పాత్రతో ట్రావెల్ అవుతున్నప్పుడు.. ఏదో కనపడాలని.. కేవలం రెండు నిమిషాలు స్క్రీన్ మీద కనపడేలా పెడితే…ఆ ఫీల్ పోయి కొంచెం డిస్ట్రబ్ అయ్యే అవకాశం వుందని భావించి జగన్ పాత్రను పెట్టలేదని చెప్పారు. అయితే కొన్ని రియల్ విజువల్స్లో ఆయన కనబడుతాడని పేర్కొన్నారు.
కాగా 70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కె సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=-IrFdt6KbPw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: