గత ఏడాది `శైలజా రెడ్డి అల్లుడు`, `సవ్యసాచి` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు నాగచైతన్య… ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ మూడు సినిమాలు కూడా తన కుటుంబ సభ్యుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాలు కావడం. ఆ సినిమాలే… `మజిలీ`, `వెంకీ మామ`, `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెళ్ళయ్యాక తన శ్రీమతి సమంతతో కలసి నటిస్తున్న చిత్రం `మజిలీ`. ఇందులో భార్యాభర్తల పాత్రల్లోనే చైతూ, సామ్ కనిపించడం విశేషం. ఇక `వెంకీ మామ`లో తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలసి నటిస్తున్నాడు చైతూ. ఆసక్తికరమైన విషయేమిటంటే… ఇందులోనూ వెంకీ, చైతూ నిజజీవిత బంధాన్నే తెరపై ప్రతిబింబిస్తున్నారు. ఇక `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌లో కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తుండగా… నాగ్ చేస్తున్న పాత్రలకి కొడుకుగానూ, మనవడిగానూ చైతూ నటిస్తున్నాడు. మొత్తమ్మీద… మూడు వరుస చిత్రాల్లో తన కుటుంబ సభ్యులతో అది కూడా నిజజీవిత బంధాన్ని తెరపై కొనసాగించడం ఆసక్తికరమైన విషయమే.
మరో విశేషమేమిటంటే… ఈ మూడూ ఆసక్తికరమైన సినిమాలు… బాక్సాఫీస్ ఫేవరేట్ సీజన్స్‌లోనే రాబోతున్నాయి. `మజిలీ` వేసవి కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా… `వెంకీ మామ` దసరా కానుకగా రానుంది. ఇక `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ సంక్రాంతికి సందడి చేయనుందని సమాచారం. మరి… ఈ మూడు ఆసక్తికరమైన చిత్రాలతో చైతూ తన స్థాయిని మరింతగా పెంచుకుంటాడేమో చూడాలి.
[youtube_video videoid=NjJoB75ksrY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: