కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`. తండ్రీకొడుకులుగా నాగ్ ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన ఈ సినిమా… ఆ ఏడాది సంక్రాంతి సినిమాల్లో పెద్ద హిట్ అనిపించుకుంది. కట్ చేస్తే… మళ్ళీ మూడేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఒరిజనల్ వెర్షన్‌ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుండగా… ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు, యువ సామ్రాట్ నాగచైతన్య కూడా నటించనున్నాడు. బంగార్రాజుకి మనవడిగా, రాముకి కొడుకుగా ఈ పాత్ర ఉంటుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… జూన్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. వేగవంతంగా చిత్రీకరణ కార్యక్రమాలు జరిపి… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి… సంక్రాంతి సీజన్‌లో విడుదలైన `సోగ్గాడే చిన్ని నాయనా` తరహాలోనే అదే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని విడుదల కానున్న ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=22j7vTZjjTk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: