
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 5


రాజమండ్రిలో `వెంకీ మామ` రెగ్యులర్ షూటింగ్?

క్రిష్ అప్పటినుండే నా సినిమా అంటున్నారు!
తమిళ్ లో అర్జున్ రెడ్డిగా ద్వారక మూవీ

అఖిల్ తో సినిమా అన్న వార్త నిజం కాదు - క్రిష్

Mr.మజ్ను ఫస్ట్ వీక్ కలెక్షన్స్

దిల్ రాజు 15 ఏళ్ల కెరీర్ లో తొలిసారిగా!

నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో నాని?

గోపీచంద్... ఆ హిందీ సినిమా రీమేక్ చేస్తున్నాడా?

మణికర్ణిక వివాదంపై స్పందించిన కంగన

రాహుల్ రామకృష్ణ హాలీవుడ్ ఎంట్రీ!

సస్పెన్స్ థ్రిల్లర్ లో కేథరిన్?

లక్ష్మీస్ ఎన్టీఅర్ ట్రైలర్ రిలీజ్ పై వర్మ ట్విస్ట్

హుషారు మూవీ 50 రోజులు పూర్తి

నాగార్జున, హరికృష్ణ మల్టీస్టారర్ `సీతారామరాజు`కి 20 ఏళ్ళు
తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళలాంటి నటులు... నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. వీరిద్దరి కలయికలో 14 చిత్రాలు రాగా... వాటిలో సింహభాగం విజయం సాధించాయి. అలాంటి ఈ ఇద్దరి మహానటుల వారసులైన... నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `సీతారామరాజు`. అన్నదమ్ములు సీతయ్య, రామరాజు పాత్రల్లో హరికృష్ణ, నాగార్జున ఒదిగిపోయి నటించిన వైనం... ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలచింది. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్, కామాక్షి మూవీస్ పతాకంపై నాగార్జున, డి.శివప్రసాద్ రెడ్డి…

రాజమండ్రిలో `వెంకీ మామ` రెగ్యులర్ షూటింగ్?
సంక్రాంతికి విడుదలైన మల్టీస్టారర్ మూవీ `ఎఫ్ 2`తో కెరీర్ బెస్ట్ గ్రాసర్‌ని సొంతం చేసుకున్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఇదే ఊపులో... మరో మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఆ చిత్రమే...`వెంకీ మామ`. తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి వెంకీ నటించనున్న ఈ సినిమా... ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కాగా... రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభం కానుందని తెలిసింది. కథ రీత్యా... గ్రామీణ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తాయని…

క్రిష్ అప్పటినుండే నా సినిమా అంటున్నారు!
మణికర్ణిక సినిమా వివాదం ఇప్పటికే పెద్ద రచ్చ అయిన సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాపై క్రిష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేకెత్తిస్తున్నాయి. సినిమా 70 శాతం షూటింగ్ తానే చేశానని... కానీ కంగన మొత్తం తానే డైరెక్షన్ చేసినట్టు చెప్పుతోందని.. క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన చెల్లి స్పందించడం... ఆ తరువాత మరొకరు.. సినిమాలో పని చేసిన ఆర్టిస్తులు ఇలా ఒకరి తరువాత ఒకరు స్పందించడంతో పెద్ద దుమారమే రేగింది.

మణికర్ణిక వివాదంపై స్పందించిన నిర్మాత - క్రిష్ కు అర్హత లేదు!
మణికర్ణిక సినిమా విషయంలో ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్, కంగన మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాను దాదాపు 70 శాతం నేనే షూటింగ్ పూర్తి చేశానని...కానీ కంగన తనకిష్టమొచ్చినట్టు క్యారెక్టర్ల నిడివి తగ్గించడం, రీషూట్లు చెయ్యడం చేసిందనీ కంగనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు క్రిష్. ఇక అక్కడ మొదలైన ఈ దుమారం చిలికి చిలికి పెద్ద తుఫాను లాగనే తయారైంది. ఈ వివాదంలో కొంత మంది కంగనకు మద్దతు తెలుపుతుండగా.. కొంత మంది క్రిష్ కు మద్దతు తెలుపుతున్నారు.
తమిళ్ లో అర్జున్ రెడ్డిగా ద్వారక మూవీ
అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు... అటు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండకు అక్కడ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సినిమాలను ఇప్పుడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అఖిల్ తో సినిమా అన్న వార్త నిజం కాదు - క్రిష్
ప్రస్తుతం" ఎన్టీఆర్- మహానాయకుడు" రిలీజ్ లోనూ, మణికర్ణిక వివాదంలోనూ బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్ అన్నపూర్ణ కాంపౌండ్ లో అఖిల్ హీరోగా సినిమా చేస్తున్నారనే వార్తలు కొన్ని వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని మూడవ చిత్రం" మిస్టర్ మజ్ను" కూడా నిరాశపరచడంతో అఖిల్ కు ఒక సినిమా చేయమని నాగార్జున డైరెక్టర్ క్రిష్ ను కోరినట్లుగా అందుకు క్రిష్ ఓకే చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లోని నిజా నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది "దతెలుగుఫిలింనగర్.కామ్".

Mr.మజ్ను ఫస్ట్ వీక్ కలెక్షన్స్
తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా Mr.మజ్ను. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల రోజు నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

`118`లో హైలైట్ సీన్ అదేనా?
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. గత ఏడాది `ఎం.ఎల్.ఎ`, `నా నువ్వే` చిత్రాలతో పలకరించిన కళ్యాణ్... ప్రస్తుతం `118`తో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ రూపొందిస్తున్నాడు. కళ్యాణ్ రామ్‌కి జోడీగా నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. మార్చి 1న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

దిల్ రాజు 15 ఏళ్ల కెరీర్ లో తొలిసారిగా!
దిల్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ సినిమా సక్సెస్ తో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన నిర్మాత దిల్ రాజు. ఆయన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తాజాగా ఎఫ్2 తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు దిల్ రాజు. ఇక ఈ ఏడాది ప్రారంభంమే ఎఫ్ 2 మంచి జోష్ ఇవ్వగా.. ఇదే జోష్ తో నాలుగైదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు దిల్ రాజు.

నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో నాని?
పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో కుటుంబ ప్రేక్షకులకు చేరువైన యువ కథానాయకుడు నాని. గత కొంతకాలంగా ట్రాక్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడీ నేచురల్ స్టార్. గత ఏడాది విడుదలైన `కృష్ణార్జున యుద్దం`లో రాక్ స్టార్‌గానూ... `దేవదాస్`లో డాక్టర్‌గానూ కనిపించిన నాని... ప్రస్తుతం `జెర్సీ`లో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు.

గోపీచంద్... ఆ హిందీ సినిమా రీమేక్ చేస్తున్నాడా?
యాక్షన్ చిత్రాల కథానాయకుడు గోపీచంద్... ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్... యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోందని సమాచారం. అంతేకాదు... ఈ సినిమా ఓ హిందీ బ్లాక్‌బస్టర్‌కి రీమేక్ వెర్షన్‌గా తెరకెక్కుతోందని టాలీవుడ్ టాక్.

మణికర్ణిక వివాదంపై స్పందించిన కంగన
ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమా గత నెల జనవరి 25వ తేదీన రిలీజై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగన ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

యాత్ర మూవీ మమ్ముట్టి ఇంటర్వ్యూ - నేను వైఎస్ లా నటించలేదు
మహి.వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘటమైన పాదయాత్ర నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఈ సినిమాల వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలంటే ఇప్పుడు చూద్దాం..

రాహుల్ రామకృష్ణ హాలీవుడ్ ఎంట్రీ!
అర్జున్ రెడ్డితో స్టార్ కమెడియన్‌గా మారిన రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. త్వరలో తాను ప్రధాన పాత్రలో నటించిన మిఠాయి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రాహుల్ రామకృష్ణ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. వినిడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ విషయాన్ని తానే తన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రదీప్ కాటసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిల్క్ రోడ్ అనే టీవీ సిరీస్ లో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

స్టార్ హీరోల కొత్త మోజు
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత విపరీతంగా ఉన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పటికే హీరోయిన్ల స్కెర్శిటీ ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేస్తుంది. మంచి స్టార్, మంచి డైరెక్టర్, మంచి కథ, మంచి టెక్నీషియన్స్- ఇలా అన్నీ మంచిగా సెట్ అయినప్పటికీ ఒక మంచి హీరోయిన్ దొరక్క భారీ సినిమాల షెడ్యూల్స్ సైతం వాయిదా పడటం తరచుగా జరుగుతుంది. మరి కొత్త కొత్త హీరోయిన్లు కోకొల్లలుగా వస్తున్నప్పటికీ ఫిలిమ్ ఇండస్ట్రీ హీరోయిన్ల విషయంలో ఎందుకు ఇంత డెఫ్షీట్ ఎదుర్కొంటోంది అని ఆలోచించాల్సిన తరుణమిది. అయితే వాస్తవంగా చూసుకుంటే హీరోయిన్ల కొరత అన్నది ఈనాటిది కాదు. దేశ…

సస్పెన్స్ థ్రిల్లర్ లో కేథరిన్?
ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ హీరోయిన్ కేథరిన్. తన నటనతో.. గ్లామర్ తో పలు సినిమాల్లో అలరించిన ఈ ముద్దు గుమ్మ.. ఈ సారి భయపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓ లేడీ ఒరియెంటెడ్ మూవీలో చేయడానికి కేథరిన్ సిద్దమైనట్టు సమాచారం.

4 లెటర్స్ మూవీ గురించి చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్ మాటల్లో..
వెండితెరపై సరికొత్త ప్రేమ కథాచిత్రం '4 లెటర్స్' త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ సంయుక్తంగా ఈ రోజు ఉదయం పాత్రికేయులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాల్లోకి వెళితే...

లక్ష్మీస్ ఎన్టీఅర్ ట్రైలర్ రిలీజ్ పై వర్మ ట్విస్ట్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ లో లక్ష్మీ పార్వతి రాకముందు వరకూ ఉంటే... లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత నుండి ఉంటుందని చెప్పడంతో ఆది నుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు తన ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూ ఇంకా క్యూరియాసిటీని పెంచుతూనే ఉన్నాడు.

వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేక పోయింది. తొలిరోజు నుండే కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా బి, సి సెంటర్లలో మాత్రం కాస్త కలెక్షన్లు బాగానే రాబట్టిందని చెప్పొచ్చు. మరి బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బిజినెస్ ముగిసిన నేపథ్యంలో... ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టిందో చూద్దాం.

హుషారు మూవీ 50 రోజులు పూర్తి
నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యం లో నూతన దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వం లో తేజు కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్, తేజస్ కంచర్ల వంటి నూతన తారాగణం తో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు మూవీ డిసెంబర్ 14 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. అందరూ కొత్తవారైనా సహజంగా నటించడం తో హుషారు మూవీ యూత్ కి నచ్చింది.