
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 3


అనుపమ ఖాతాలో అరుదైన రికార్డు

మహేష్... ఒకే ఏడాదిలో రెండు మైల్ స్టోన్స్

కొత్త మూవీ షూటింగ్ కు రెడీ

#ప్రభాస్ 20 మూవీ పై ప్రశంసలు

మా కిల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్

ఆగిపోయిన తమిళ్ అర్జున్ రెడ్డి - మళ్లీ రీ షూట్!

యాత్ర సినిమా ప్రత్యేకతలు

షూటింగ్ మొదలుపెట్టిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్

మహర్షి డబ్బింగ్ ప్రారంభం

టాలెంటెడ్ దర్శకుడితో త్రిష కొత్త చిత్రం?

అల్లు అర్జున్ తండ్రిగా పవన్ కళ్యాణ్ తాతయ్య?

ఆకాష్ పూరీ కొత్త సినిమా అప్ డేట్

రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగచైతన్య

హీరో స్వంత బ్యానర్ లో హీరోగా దర్శకుడు
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన పెళ్ళిచూపులు మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది కానీ తరుణ్ భాస్కర్ హీరోగా, విజయ్ దేవరకొండ నిర్మాతగా ఒక మూవీ రూపొందనుంది. తరుణ్ భాస్కర్ సక్సెస్ ఫుల్ మూవీస్ మహానటి, సమ్మోహనం లలో అతిథి పాత్రలలో నటించారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ హీరోగా మారుతున్నారు.

ప్రభాస్ `మిర్చి`కి ఆరేళ్ళు
`కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్`... ఈ డైలాగ్ థియేటర్లలో తొలిసారిగా వినిపించి ఈ రోజుకి ఆరేళ్ళు పూర్తవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `మిర్చి` విడుదలై ఆరేళ్ళు అవుతోంది. అలాగే... వరుస విజయాలతో దూసుకుపోతున్న రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన సినిమా రిలీజై ఆరు వసంతాలు. పేరుకి యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినా... కుటుంబ బంధాలకు, మానవ విలువలకు ఎంతో ప్రాధాన్యమిచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కొరటాల. ప్రభాస్ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా…

అనుపమ ఖాతాలో అరుదైన రికార్డు
అనుపమ పరమేశ్వరన్... చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా ఉండే రూపం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ రూపంతోనే దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన ఈ కేరళ కుట్టి... తాజాగా తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే... దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించడమే కాకుండా ఆ యా భాషల్లో మొదటి సినిమాలతోనే మంచి విజయాలను అందుకోవడం.

మహేష్... ఒకే ఏడాదిలో రెండు మైల్ స్టోన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు... యాడ్ వరల్డ్‌లోనూ స్కై ఈజ్ లిమిట్ అన్నట్లుగా దూసుకుపోతున్నాడీ ప్రిన్స్. అలాంటి మహేష్‌కి... 2019 కెరీర్ పరంగా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే... ఒకే సంవత్సరంలో కెరీర్ పరంగా రెండు మైలురాళ్ళకు చేరుకుంటున్నాడీ తెలుగు తెర రాజకుమారుడు.


కొత్త మూవీ షూటింగ్ కు రెడీ
తెలుగు, తమిళ భాషలలో అగ్ర తారగా వెలుగొందుతున్న అనుష్క నటించిన భాగమతి మూవీ 2018 జనవరిలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సూపర్ హిట్ మూవీ తరువాత అనుష్క ఏ మూవీ లోను నటించలేదు. ఇప్పుడు ఒక కొత్త మూవీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

#ప్రభాస్ 20 మూవీ పై ప్రశంసలు
యు వి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ బ్యానర్స్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల తార పూజా హెగ్డే జంటగా హిట్ మూవీ జిల్ దర్శకుడు KK రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్ 20 మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో ప్రభాస్, సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో స్టైలిష్ గా రూపొందుతున్న సాహో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మా కిల్ బిల్ పాండే ఈజ్ బ్యాక్
టాలీవుడ్ ప్రముఖ టాప్ కమెడియన్ బ్రహ్మానందంకు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. దీంతో గత కొద్దికాలంగా ఆయన ఆస్పత్రిలోనే ఉండగా...ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

ఆగిపోయిన తమిళ్ అర్జున్ రెడ్డి - మళ్లీ రీ షూట్!
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండకు ఒక్కసారిగా యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. స్టార్ డమ్ కూడా పెరిగిపోయింది. ఇక ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఇప్పుడొక సంప్రదాయంగా కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాను కూడా హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తుండగా... తమిళ్ లో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో వర్మ అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది.

హీరో హీరోయిన్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
అడ్డా, ఓటర్ చిత్రాల డైరెక్టర్ జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. హీరో హీరోయిన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

యాత్ర సినిమా ప్రత్యేకతలు
మహ. వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. వైఎస్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టం ఏదైనా ఉందంటే అది పాదయాత్ర అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా విషయంలో కూడా పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంలోనే ఉండబోతుందన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. అంతేనా.. త్వరలో ఎన్నికలు రానున్నాయి కదా అందుకే ఈ నేపథ్యంలో ఇప్పుడు కావాలనే ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు. ఎన్నికల స్టంట్, జగన్ కు సపోర్ట్ గా తీస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే డైరెక్టర్ మాత్రం ఇది ఏ రాజకీయ…

షూటింగ్ మొదలుపెట్టిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్
కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే మొదలైనట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ను 'కర్నూల్'లో ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగు జరగనుందట.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ
స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇటీవలే ఈ సినిమా పోస్టర్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా..చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. వినోదాత్మకంగా ఉన్న నవీన్ పొలిశెట్టి లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

మహర్షి డబ్బింగ్ ప్రారంభం
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా మహర్షి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. గత కొద్దికాలంగా షెడ్యూల్ వారీగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇప్పుడు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. పొల్చాచ్చి, తమిళనాడులో ఇటీవలే షూటింగ్ ముగించుకోగా.. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దాని తరువాత నెక్ట్స్ షెడ్యూల్ ను అబుదాబిలో చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అబుదాబి షెడ్యూల్ తో.. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుందని సమాచారం.

బాలకృష్ణ, బోయపాటి చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్?
`సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత చిత్రాల తరహాలోనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. యన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నాడట బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

టాలెంటెడ్ దర్శకుడితో త్రిష కొత్త చిత్రం?
తెలుగు, తమిళ భాషల్లో పలు వైవిధ్యభరితమైన పాత్రలు చేసి అలరించింది చెన్నై బ్యూటీ. ఇక గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం `96` చిత్రంతో నటిగా మరోసారి తన ప్రతిభను చాటుకుందీ అమ్మడు. ఈ సినిమా తరువాత... తమిళనాట త్రిష డిమాండ్ మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో... ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

అల్లు అర్జున్ తండ్రిగా పవన్ కళ్యాణ్ తాతయ్య?
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

ఆకాష్ పూరీ కొత్త సినిమా అప్ డేట్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఇస్మార్ శంకర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరోపక్క తనయుడు ఆకాష్ సినిమాను కూాడా పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాకు మంచి టాక్ అయితే వచ్చిందని కానీ... అశించినంత విజయం మాత్రం దక్కించుకోలేక పోయింది.

మూడేళ్ళ పాటు సమ్మర్‌నే టార్గెట్ చేసుకున్న మహేష్ బాబు
`పోకిరి`, `భరత్ అనే నేను`... సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాలు. ఈ రెండు సినిమాలకి సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే... ఈ బ్లాక్‌బస్టర్ హిట్స్ సమ్మర్ సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ముఖ్యంగా... ఏప్రిల్ నెలతో మహేష్‌కి మంచి అనుబంధమే ఉంది. ఆ నెలలోనే `పోకిరి`, `భరత్ అనే నేను` విడుదలై ఘనవిజయం సాధించాయి.

రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగచైతన్య
`ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య` చిత్రాల్లో జంటగా నటించి కనువిందు చేసిన నాగచైతన్య, సమంత... పెళ్ళి తరువాత నటిస్తున్న తొలి చిత్రం `మజిలీ`. `నిన్ను కోరి` వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యభర్తల బంధం, వారి భావోద్వేగాలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా... రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగచైతన్య కనిపిస్తున్నాడు.