మహర్షి డబ్బింగ్ ప్రారంభం

Latest Telugu Movies 2019, Maharshi Movie Dubbing Commences, Mahesh Babu Maharshi Movie Dubbing Commences, Mahesh Babu Maharshi Movie Latest News, Super Star Mahesh Babu Maharshi Movie Dubbing Commences, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Mahesh Babu Maharshi Movie Dubbing Commences

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా మహర్షి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. గత కొద్దికాలంగా షెడ్యూల్ వారీగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇప్పుడు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. పొల్చాచ్చి, తమిళనాడులో ఇటీవలే షూటింగ్ ముగించుకోగా.. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. దాని తరువాత నెక్ట్స్ షెడ్యూల్ ను అబుదాబిలో చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అబుదాబి షెడ్యూల్ తో.. ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తవుతుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల స్పీడు పెంచారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ పనులు ప్రారంభించాడు దర్శకుడు వంశీ. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్‌తో పాటు నిర్మాత దిల్‌ రాజు పాల్గొన్నారు.

కాగా ఈ సినిమాలో మహేష్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేష్ స్నేహితుడిగా కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=Brd1RdYsiR0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =