
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 2


నిర్మాత అవతారమెత్తనున్న కాజల్ అగర్వాల్?

యాత్ర చిత్ర యూనిట్ కు అభినందనలు

షూటింగ్‌కి సిద్ధమవుతున్న `డిస్కో రాజా`

పోలీస్ అధికారి రామరాజుగా రామ్ చరణ్?

నాని సినిమాలో అదా శర్మ ప్రత్యేక గీతం?

పూరి కనెక్ట్స్ లో రెండవ మూవీ

యూవీ క్రియేషన్స్‌లో నాగచైతన్య?

రైటర్ అవతారమెత్తుతున్న నేచురల్ స్టార్?

`మన్మథుడు 2`లో అక్కినేని అమల?

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

అప్పుడు కీర్తి సురేష్ ఇప్పుడు నయనతార

సమంత పాలిటిక్స్ లో ?

కూతుర్ని దొంగ ఫెలో అంటున్న బన్నీ - ఫన్నీ సంభాషణ

వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యువనటుడు

`ఆర్ ఆర్ ఆర్` కోసం 1000 ఫైటర్స్?

పైరసీ పై కేంద్ర నిర్ణయం - జైలు శిక్ష, జరిమానా

మహర్షి మూవీ - బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరో యాక్షన్ సీన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి ఎండింగ్ కు కానీ... మార్చి ఫస్ట్ వీక్ కు కానీ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవ్వనుంది.

నిర్మాత అవతారమెత్తనున్న కాజల్ అగర్వాల్?
కాజల్ అగర్వాల్... యువతరం కలలరాణి. ఈ నెల 15తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం పూర్తి కావస్తోంది. మొదటి తెలుగు చిత్రం `లక్ష్మీ కళ్యాణం` రోజుల్లో ఎలా ఉందో... ఇప్పటికీ అలాగే వన్నె తరగని అందంతో అభిమానులను పెంచుకుంటూ... అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది కాజల్. దాదాపు టాప్ హీరోలందరితోనూ ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ... అతి త్వరలో సరికొత్త అవతారం ఎత్తడానికి సిద్ధమవుతోందని టాక్.

యాత్ర చిత్ర యూనిట్ కు అభినందనలు
70 MM ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా దివంగత ముఖ్య మంత్రి , మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ మూవీ యాత్ర మహి వి రాఘవ్ దర్శకత్వం లో రూపొంది ఫిబ్రవరి 8వ తేదీ రిలీజయి విజయం సాధించింది. దిగ్విజయం గా ప్రదర్శించబడుతున్న యాత్ర మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందింది.

షూటింగ్‌కి సిద్ధమవుతున్న `డిస్కో రాజా`
మాస్ మహరాజ్ రవితేజ... ఓ సైంటిఫిక్ ఫిక్షన్‌తో థ్రిల్ చేయనున్నాడు. ఆ చిత్రమే `డిస్కో రాజా`. పిరియాడిక్ టచ్‌తో సాగే ఈ చిత్రంలో డిస్కో డ్యాన్సర్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` వంటి జనరంజక చిత్రాన్ని అందించిన విఐ. ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు కాగా... `నేల టిక్కెట్టు` ఫేమ్ రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నభా నటేశ్‌తో పాటు మరో కథానాయిక కూడా నటించనుంది.

పోలీస్ అధికారి రామరాజుగా రామ్ చరణ్?
`తుఫాన్`, `ధ్రువ` చిత్రాల్లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అలరించాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. మరోసారి... ఈ స్టార్ హీరో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. అయితే... ఈ సారి పిరియాడిక్ టచ్ ఉండడమే ఆ పాత్ర ప్రత్యేకత. కాస్త వివరాల్లోకి వెళితే... దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మాసివ్ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ యన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే... చరణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.

నాని సినిమాలో అదా శర్మ ప్రత్యేక గీతం?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `జెర్సీ`. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు నాని. ఒకటేమో యంగ్ రంజీ ప్లేయర్ రోల్ కాగా... మరొకటి ఆ క్యారెక్టర్‌కు తండ్రి పాత్ర. రెండో పాత్రలోనే... మధ్య వయస్కుడైన క్రికెటర్ అర్జున్ గానూ కనిపించనున్నాడట నాని. అంతేకాదు... ట్రాజిక్ ఎండింగ్‌తో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ టాక్.

పూరి కనెక్ట్స్ లో రెండవ మూవీ
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మీ )నిర్మాణ సారధ్యం లో స్వీయ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి ని టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా మూవీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరి కనెక్ట్స్ తమ తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేసింది.

యూవీ క్రియేషన్స్‌లో నాగచైతన్య?
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య ఒకరు. తన శ్రీమతి సమంతతో పెళ్ళయ్యాక నటిస్తున్న `మజిలీ` సినిమా తుది దశలో ఉండగా... తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలసి నటించనున్న `వెంకీ మామ` త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి ముస్తాబవుతోంది. అలాగే తన తండ్రి కింగ్ నాగార్జున కాంబినేషన్‌లోనూ `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు చైతూ.

రైటర్ అవతారమెత్తుతున్న నేచురల్ స్టార్?
తన సహజ నటనతో యువతరానికి, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన యువ కథానాయకుడు నాని. ఆ మధ్యంతా పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లో కనిపించిన నాని... ఈ మధ్య తన శైలికి భిన్నంగా సాగే పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే... గత ఏడాది `దేవదాస్`లో డాక్టర్‌గా కనిపించి అలరించిన ఈ నేచురల్ స్టార్... అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ`లో మధ్యవయస్కుడైన క్రికెటర్ అర్జున్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లోనూ మరో కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడట ఈ యంగ్ హీరో.

`మన్మథుడు 2`లో అక్కినేని అమల?
అక్కినేని నాగార్జున, అక్కినేని అమల... రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ సూపర్ హిట్ జోడీ. పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన అమల... ఆ మధ్య `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` (2012) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అక్కినేని కుటుంబమంతా కలసి నటించిన `మనం` (2014)లో అతిథి పాత్ర పోషించారు. అనంతరం `హమారి అధూరి కహానీ` (2015), `కార్వాన్` (2018) వంటి హిందీ చిత్రాల్లోనూ... `కేరాఫ్ సైరా భాను` (2017) అనే మలయాళ చిత్రంలోనూ అమల కనిపించారు. కాగా... ఐదేళ్ళ తరువాత తెలుగు తెరపై దర్శనమివ్వనున్నారట అమల.

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహి.వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

అప్పుడు కీర్తి సురేష్ ఇప్పుడు నయనతార
ఈ మధ్య షూటింగ్ లు పూర్తయిన వెంటనే గిఫ్ట్స్ ఇవ్వడం ఓ సాంప్రదాయంగా మారిపోయింది. ఒకప్పుడు అలనాటి మహానటి సావిత్రి ఇలా చేస్తుండేవారు. తాను నటిస్తున్న టైమ్ లో చిత్ర యూనిట్ ఇలా గోల్డ్ కాయిన్స్ ఇస్తుండేవారు. ఆ తరువాత ఆమె బయోపిక్ లో నటించిన నేపథ్యంలో కీర్తి సురేష్ మహానటి సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు.. సావిత్రి సాంప్రదాయన్నే పాటించింది. అందరికీ గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. పందెంకోడి 2 చిత్ర షూటింగ్ పూర్తయినప్పుడు కూడా యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది.

సమంత పాలిటిక్స్ లో ?
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల స్టార్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారా ? అనే టాపిక్ తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. రియల్ పాలిటిక్స్ లోకి కాకుండా సమంత రీల్ పాలిటిక్స్ లోకి రానున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఒక మూవీ రూపొందనుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ నాగకన్య ఫస్ట్ లుక్ రిలీజ్
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో పాము నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో నీయా అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగులో నాగకన్య అనే పేరుతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్టు పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.

కూతుర్ని దొంగ ఫెలో అంటున్న బన్నీ - ఫన్నీ సంభాషణ
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ రెస్టింగ్ మోడ్ లో ఉన్నాడు. నా పేరు సూర్యు నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో తన కొత్త సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ ఖాళీ టైంలో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో టైం గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తన కూతురు అర్హతో కలిసి అల్లు అర్జున్ జరిపిన ఓ క్యూట్ కన్వర్జేషన్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యువనటుడు
తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు చరణ్ దీప్. ‘పటాస్’ సినిమాతో నెగటివ్ షేడ్స్ లో నటించిన చరణ్ దీప్ ఆ తరువాత ‘లోఫర్’ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమాలో తన పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు.. ‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలో కనిపించి తన నటనతో మళ్లీ ఆకట్టుకున్నాడు. కల్కీ సినిమాలో కూడా చరణ్ దీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. గరుడ వేగలో పాజిటివ్ పాత్రలో నటించగా.. కల్కీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు.

కీర్తి శిఖరంపై నిర్మించిన అక్షర సౌధం "ఎన్టీఆర్ ఏ బయోపిక్"
ఒక శక్తిగా, వ్యవస్థగా ఎదిగి ప్రజల మనసుల్లో ఒక ప్రగాఢమైన ముద్రను వేసిన వ్యక్తి చరిత్రను అక్షరబద్ధం చేసినప్పుడు దాన్ని చదువుతున్న పాఠకుడుకి ఆ వ్యక్తి యొక్క మహోన్నత వ్యక్తిత్వము, కార్యదక్షత, నిష్పాక్షిక వ్యవహార శైలి కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. అలాంటి గొప్ప ప్రయత్నమే “ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ” అనే పుస్తకం.

`ఆర్ ఆర్ ఆర్` కోసం 1000 ఫైటర్స్?
మాసివ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న `ఆర్ ఆర్ ఆర్`... రోజు రోజుకి అంచనాలు పెంచేస్తోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడం... `అపజయమెరుగని దర్శకుడు` రాజమౌళి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం వంటి అంశాలు ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నాటి నుంచే సూపర్ బజ్ పుట్టిస్తే... నిర్మాణ దశలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ని `స్కై లెవల్`కు తీసుకు వెళుతున్నాయి.

పైరసీ పై కేంద్ర నిర్ణయం - జైలు శిక్ష, జరిమానా
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా కానీ ఈ మధ్య పైరసీ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే పైరసీరాయుళ్లు మాత్రం విడుదలైన కొద్ది క్షణాలకే సినిమాను సైట్లలో పెట్టేస్తున్నారు. ఈమధ్య కొత్తగా బెదిరించడం కూడా నేర్చుకున్నారు. 2.0 సినిమాను ముందే పైరసీ చేసి సైట్లలో పెడతామని బెదిరించిన దాఖలాలు కూడా చూశాము. అలా చలనచిత్ర రంగానికి పెద్ద సమస్యగా మారింది పైరసీ భూతం.