తెలుగు, తమిళ భాషలలో అగ్ర తారగా వెలుగొందుతున్న అనుష్క నటించిన భాగమతి మూవీ 2018 జనవరిలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సూపర్ హిట్ మూవీ తరువాత అనుష్క ఏ మూవీ లోను నటించలేదు. ఇప్పుడు ఒక కొత్త మూవీ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వం లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ షూటింగ్ అమెరికాలోని సియోటెల్ లో ప్రారంభం కానుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తిగా అమెరికా లో జరుగనుందని సమాచారం. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=0vN1lVAKdtM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: