`పోకిరి`, `భరత్ అనే నేను`… సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాలు. ఈ రెండు సినిమాలకి సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే… ఈ బ్లాక్‌బస్టర్ హిట్స్ సమ్మర్ సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ముఖ్యంగా… ఏప్రిల్ నెలతో మహేష్‌కి మంచి అనుబంధమే ఉంది. ఆ నెలలోనే `పోకిరి`, `భరత్ అనే నేను` విడుదలై ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… మహేష్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ `మహర్షి` కూడా వేసవిలోనే విడుదల కానుంది. మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వేసవి కానుకగా ఈ సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాదు… సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న కొత్త చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది వేసవిలోనే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నారని టాలీవుడ టాక్. మొత్తమ్మీద… 2018, 2019, 2020… ఇలా వరుసగా మూడు సంవత్సరాల పాటు మహేష్ బాబు సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని ఆ విషయంలో హ్యాట్రిక్ కొట్టనున్నాడన్నమాట. త్వరలోనే మహేష్, సుకుమార్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=01cnjROvbbU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: