డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఇస్మార్ శంకర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరోపక్క తనయుడు ఆకాష్ సినిమాను కూాడా పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాకు మంచి టాక్ అయితే వచ్చిందని కానీ… అశించినంత విజయం మాత్రం దక్కించుకోలేక పోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఆకాష్ హీరోగా మరో కొత్త సినిమా ఖరారైనట్లు తెలుస్తోంది. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ ఈ సినిమా తెరకెక్కించనున్నారట. ఈ సినిమాతో అనిల్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే పూరీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగానే కాకుండా ఈ సినిమాకు కథను కూడా పూరీనే అందిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయట. త్వరలోనే సినిమాను లాంఛనంగా ప్రారంభించి షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=2151SOutoiI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: