యాత్ర సినిమా ప్రత్యేకతలు

Yatra Movie Highlights,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Yatra Telugu Movie Highlight Scenes,Yatra Movie Latest News,Mammootty Yatra Movie Highlights,Yatra Highlights
Yatra Movie Highlights

మహ. వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. వైఎస్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టం ఏదైనా ఉందంటే అది పాదయాత్ర అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా విషయంలో కూడా పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రాజకీయ నేపథ్యంలోనే ఉండబోతుందన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. అంతేనా.. త్వరలో ఎన్నికలు రానున్నాయి కదా అందుకే ఈ నేపథ్యంలో ఇప్పుడు కావాలనే ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు. ఎన్నికల స్టంట్, జగన్ కు సపోర్ట్ గా తీస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే డైరెక్టర్ మాత్రం ఇది ఏ రాజకీయ నేపథ్యంలో తీసిన సినిమా కాదు.. ఈసినిమా వల్ల వాళ్లకి ఒక్క ఓటు కూడా రాదని చాలా స్పష్టంగా చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి రేపు విడుదలకాబోతున్న ఈ సినిమా ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం..

* భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా రేపు విడుదలకాబోతుంది. నిజానికి ఓ సినిమా హీరో, హీరోయిన్ బయోపిక్ అయితే ఇంత భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ మెట్ట‌మెద‌టి సారిగా ఓ రాజ‌కీయ‌నాయ‌కుడి బ‌యోపిక్ తీస్తే ఒక్క ఓవ‌ర్‌సీస్ లోనే 180 స్క్రీన్స్‌, ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్ లొ విడుద‌ల చేయ‌టం ఈ సినిమా పై తెలుగు ప్ర‌జ‌ల క్రేజ్ ని తెలియజేస్తుంది.

* మరో ఇంట్రెస్టింగ్ విషయంఏంటంటే. క‌డ‌ప దాటి ప్ర‌తి గ‌డ‌ప‌లోకి స్వ‌యంగా వెళ్ళి పేద‌వాడి స‌మ‌స్య‌లు తెలుసుకోవడానికి వైఎస్ పాదయాత్ర మొదలు పెట్టారు. యాత్ర ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర‌నుండి ప్ర‌తి రైతుని, పేద‌వాడిని స్వ‌యంగా క‌లిసి వారి స‌మ‌స్య‌లు విన‌్నారు. అయితే ప్ర‌జాయాత్ర ని పాద‌యాత్ర గా ప్రారంభించిన జ‌న‌నేత‌గా , మ‌హ‌నేత‌గా పేద ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడుగా ఎప్ప‌టికి ప‌దిల‌మైన చోటు సుస్థిర‌ప‌రుచుకున్న వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పాద‌యాత్ర 68 రోజుల్లో పూర్తిచేసిన విష‌యం తెలిసిందే. యాధృచ్చికంగా ఈ యాత్ర షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తయింది.

* ఇది ఒక రాజకీయనాయకుడి బయోపిక్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఈ సినిమాలో ఎలాంటి రాజకీయాలు ఉండవు. వినడానికి విచిత్రంగా అదే నిజం. 68 రోజులు సాగిన పాద‌యాత్ర లో రైతుల క‌ష్టాలు, పేద‌వాళ్ళ ఆవేద‌న‌లు ప్ర‌తిఒక్కరి భావోద్వేగాలు రాజ‌న్న మ‌న‌సుతో విన‌టమే ఈ చిత్రం లో కీల‌క భాగం. ఈ సినిమాలో రాజన్న, ప్రజలు, వాళ్ల కష్టాలు, సమస్యలే ఉంటాయి కానీ ఎలాంటి రాజకీయాలు లేవు. క‌ష్టం ఎవ‌రికైనా క‌ష్ట‌మే కదా. అందుకే ప్ర‌తిఓక్క‌రూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోన‌వుతారు.

* ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి. వైఎస్ పాత్రలో మ‌మ్ముట్టి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారని చెప్పొచ్చు. ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడుతూ.. ఈ క‌థ రాయ‌జ‌కీయ నాయ‌కుడి క‌థ మాత్ర‌మే… రాజ‌కీయాలు వుండ‌వు.. ప్ర‌జ‌ల క‌ష్టాలు, రైతు బాద‌లు వుంటాయి.. ఇవ‌న్ని భార‌త‌దేశం అంత‌టా వుంటాయి.. ఏ రైతు ని అడిగినా ఏ పేద‌వాడిని అడిగినా వారి క‌ష్టాలు చెప్తారు.. అని చెప్పారు.

* 70 య‌మ్ య‌మ్ బ్యాన‌ర్ లో ఎమెష‌నల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యాత్ర‌ ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. ఎమోష‌న‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్రం గా ఫ్యామిలీ ఎమోషన్ ని ద‌ర్శ‌కుడు చూపించారు. ఈ చిత్రం కేవ‌లం లోక‌ల్ స‌బ్జెక్ట్ కాదు.. యూనివ‌ర్స‌ల్ గా ప్ర‌తి సినిమా ల‌వ‌ర్ చూడాల్సిన చిత్రం గా రూపొందించారు.

[subscribe]

[youtube_video videoid=MkaDt7KB5eQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.