`కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్`… ఈ డైలాగ్ థియేటర్లలో తొలిసారిగా వినిపించి ఈ రోజుకి ఆరేళ్ళు పూర్తవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `మిర్చి` విడుదలై ఆరేళ్ళు అవుతోంది. అలాగే… వరుస విజయాలతో దూసుకుపోతున్న రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ తొలిసారిగా మెగాఫోన్ పట్టిన సినిమా రిలీజై ఆరు వసంతాలు. పేరుకి యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినా… కుటుంబ బంధాలకు, మానవ విలువలకు ఎంతో ప్రాధాన్యమిచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు కొరటాల. ప్రభాస్ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలచిన ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్, నదియా, సంపత్ రాజ్, ఆదిత్య మీనన్, బ్రహ్మానందం, నాగినీడు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో పాటలన్నీ జనాదరణ పొందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`మిర్చి` – కొన్ని విశేషాలు
* సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మించిన తొలి చిత్రమిది. ప్రస్తుతం ఇదే సంస్థ ఆరేళ్ళ తరువాత ప్రభాస్‌తో భారీ బడ్జెట్ మూవీ `సాహో` నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ త్రిభాషా చిత్రం తెరపైకి రానుంది.
* తెలుగులో టాలెంటెడ్ యాక్ట్రస్ నదియా రీ-ఎంట్రీ ఇచ్చిన చిత్రం
* ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ కళా దర్శకుడు (ఎ.ఎస్.ప్రకాష్), ఉత్తమ విలన్ (సంపత్ రాజ్), ఉత్తమ నేపథ్య గాయకుడు (కైలాష్ ఖేర్ – పండగలా దిగివచ్చాడు)… ఇలా ఆరు విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకుందీ సినిమా.
* కన్నడంలో `మాణిక్య` పేరుతోనూ… బెంగాలీలో `బిందాస్` పేరుతోనూ… ఒడియాలో `బిశ్వనాథ్` పేరుతోనూ ఈ సినిమా రీమేక్ అయ్యింది.
[youtube_video videoid=Pjxehc0401I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: