తెలుగు, తమిళ భాషల్లో పలు వైవిధ్యభరితమైన పాత్రలు చేసి అలరించింది చెన్నై బ్యూటీ. ఇక గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం `96` చిత్రంతో నటిగా మరోసారి తన ప్రతిభను చాటుకుందీ అమ్మడు. ఈ సినిమా తరువాత… తమిళనాట త్రిష డిమాండ్ మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో… ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శరవణన్ రూపొందించనున్నాడు. గతంలో శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో `జర్నీ` (2011) చిత్రాన్ని తెరకెక్కించి… దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించాడు శరవణన్. వేసవిలో పట్టాలెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. పదహారేళ్ళుగా కథానాయికగా రాణిస్తున్న త్రిష… ఈ చిత్రంతో నటిగా మరో మెట్టు ఎదుగుతుందేమో చూడాలి.
[youtube_video videoid=JPm_X8_5GAI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: