కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే మొదలైనట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ను ‘కర్నూల్’లో ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగు జరగనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా హన్సిక నటిస్తోంది. ‘గౌతమ్ నంద’ తరువాత హన్సిక చేస్తోన్న సినిమా ఇదే. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళి శర్మ, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎన్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతన్న ఈ మొదటి సినిమాను అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సందీప్ కిషన్, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. హన్సిక కూడా తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తుంది. మరి వీరిద్దరి ఈ సినిమా ఎంత వరకూ కలిసొస్తుందో చూద్దాం.
నటీనటులు:
సందీప్ కిషన్, హన్సిక, మురళి శర్మ, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
స్క్రీన్ ప్లే, దర్శకుడు: జి నాగేశ్వరరెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి
నిర్మాణ సంస్థ: ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్: జగదీష్
కథ: రాజసింహ
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: శ‌్యామ్ కే నాయుడు
మాటలు: నివాస్, భవానీ ప్రసాద్
[youtube_video videoid=unJTnSbbk8c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: