`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `అత్తారింటికి దారేది` చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తాతయ్యగా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరాని ఈ సినిమాలో బన్నీకి తండ్రి పాత్రలో నటించనున్నాడని సమాచారం. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే… బొమన్ ఇరానిని ఏరికోరి త్రివిక్రమ్ ఎంచుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే బొమన్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానుంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























