విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండకు ఒక్కసారిగా యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. స్టార్ డమ్ కూడా పెరిగిపోయింది. ఇక ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం ఇప్పుడొక సంప్రదాయంగా కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాను కూడా హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తుండగా… తమిళ్ లో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో వర్మ అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా… ఇప్పుడు తమిళ్ రీమేక్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. తమిళ వెర్షన్ వర్మను విడుదల చేయబోవడం లేదని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి కారణం సినిమా అనుకున్న విధంగా రాకపోవడమేనట. తమిళ వెర్షన్‌ను ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించడానికి సిద్ధమైంది. ఈ సంస్థ బి స్టూడియోతో కలిసి ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్లకి సినిమా సంతృప్తిగా అనిపించలేదట. బాల తమకు కావాల్సిన విధంగా సినిమా అవుట్ పుట్ ఇవ్వలేకపోయారట. దీంతో ఈ సినిమాను మళ్ళీ మొదటనుండి ప్రెష్ గా రీషూట్ చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు ఈసినిమాలో నటిస్తున్న హీరో ధ్రువ్ తప్ప… మిగిలిన వారందరిని కొత్త వాళ్లని తీసుకోవాలని చూస్తున్నారట. మరి ఈ సినిమా రీ షూట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ చేస్తారో..!
[youtube_video videoid=EVrgWqwbdIE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: