`సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత చిత్రాల తరహాలోనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. యన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నాడట బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటించనున్నారని టాలీవుడ్ టాక్. వారిలో ఒకరిగా ఇప్పటికే కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైందని వార్తలు రాగా… మరొకరిగా ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని సమాచారం. త్వరలోనే కథానాయికలకు సంబంధించిన వివరాలపై ఫుల్ క్లారిటీ వస్తుంది. 2020 సంక్రాంతికి బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ మూవీ తెరపైకి రానుంది.
[youtube_video videoid=jUxnrFUYzBA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























