`ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య` చిత్రాల్లో జంటగా నటించి కనువిందు చేసిన నాగచైతన్య, సమంత… పెళ్ళి తరువాత నటిస్తున్న తొలి చిత్రం `మజిలీ`. `నిన్ను కోరి` వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యభర్తల బంధం, వారి భావోద్వేగాలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా… రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగచైతన్య కనిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఇటీవల విశాఖపట్నం పరిసరాల్లో రెండు పాటల్ని, కథలో కీలకంగా వచ్చే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఐదేళ్ళ గ్యాప్ తరువాత చైతూ, సామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా… `ఏమాయ చేసావె`, `మనం` స్థాయిలోనే ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. క్రికెటర్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్న ఈ సినిమాలో గృహిణి పాత్రలో సమంత కనిపించనుండగా… మరో కథానాయికగా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. వేసవి సందర్భంగా ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=Z5svHQuXo4A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: