
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 38


మూడు భాగాలు , మూడు టైటిల్స్ తో ఆర్ జి వి బయోపిక్

ఈ సినిమాతో మాఅమ్మ కల నిజమవుతుంది

థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఏది రీప్లేస్ చేయలేదు

శర్వానంద్ "శ్రీకారం " మూవీ అప్ డేట్

'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ టీజర్ పై రాజమౌళి క్లారిటీ

బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా

హీరో నాని కి జోడీగా మరోసారి అదితి రావు హైదరి ?
బాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ- దశాబ్దం తర్వాత
ఆ సినిమాలో రకుల్ లేనట్టే..!
ఇంట్లో లేకపోతే 'మహేష్' అక్కడే.. నమ్రతా

వెంకటేష్ 34 సంవత్సరాల సినీ జర్నీ
మలయాళం రీమేక్ లో రాజశేఖర్..?
"అప్పట్లో ఒకడుండేవాడు" మూవీ హిందీ రీమేక్ ?
నివేద థామస్ మనసులో మాట
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్

కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ

'FEAR' కి కొత్త అర్ధం చెపుతున్న 'శీను'
డింపుల్ హయతి కి బాలీవుడ్ బిగ్ ఆఫర్

మాకు 22 టైమ్స్ పెళ్లి చేశారు
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతారల ప్రేమ, పెళ్లి వ్యహారాలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. విఘ్నేష్ శివన్-నయనతారలు గత కొంత కాలంగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ గురించి కానీ.. రిలేషన్ షిప్ గురించి కానీ వీరిద్దరూ బహిరంగంగా చెప్పింది లేదు. అయితే అప్పుడుప్పుడు తమ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక అవి చూసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు అల్లేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.

మూడు భాగాలు , మూడు టైటిల్స్ తో ఆర్ జి వి బయోపిక్
సంచలన చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన చిత్రానికి తెర తీశారు. దర్శకుడు ఆర్ జి వి కి వ్యతిరేకంగా పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆర్ జి వి ఇప్పుడు ఎవరో తన మీద సినిమాలు రూపొందిందించటం ఏంటని , తన బయోపిక్ ను మూడు భాగాలు , మూడు టైటిల్స్ తో నిర్మించడానికి ప్లాన్ చేశారు. తన బయోపిక్ మూవీ వివరాలను ఆర్ జి వి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సినిమాతో మాఅమ్మ కల నిజమవుతుంది
ఫైనల్లీ మా అమ్మ డ్రీమ్ ఇన్నేళ్లకు నెరవేరుతుంది అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ డ్రీమ్ ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. చిరు-రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని చిరు సతీమణి.. రామ్ చరణ్ తల్లి సురేఖకు ఎప్పటినుండో కోరికట. అది ఆచార్య సినిమాతో మొత్తానికి నిజమవుతుందని చెపుతున్నాడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.

థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఏది రీప్లేస్ చేయలేదు
లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. సినిమాల షూటింగ్లు జరుపుకోవచ్చు అని ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నా కరోనాకు భయపడి ఎవరూ పెద్దగా షూటింగ్ లకు వెళ్లట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకొచ్చి తక్కువమంది సిబ్బందితో.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సినిమా థియేటర్లలో బొమ్మ పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇక ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపించట్లేదు. మరో పక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుంజుకున్నాయి. మొదట చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో నాని 'వి'…

శర్వానంద్ "శ్రీకారం " మూవీ అప్ డేట్
"గమ్యం ", "రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి ", "మహానుభావుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ ప్రస్తుతం "శ్రీకారం "మూవీ లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యంలో "శ్రీకారం " మూవీ తెరకెక్కుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ టీజర్ పై రాజమౌళి క్లారిటీ
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఫస్ట్ లుక్, ఇంట్రో వీడియో ఉంటుందని అనుకున్నారు కానీ కుదరలేదు. దానితో అభిమానులు కాస్త నిరాశకుగురయ్యారని చెప్పొచ్చు.

బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా
ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా నార్మల్ లైఫ్ లోకి వచ్చేసాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఛాలెంజ్ ను పూర్తి చేసి రానా కు కూడా ఛాలెంజ్ ను విసిరారు. శ్రుతీహాసన్ కూడా రానా ను నామినేట్ చేసింది. ఇక ఈ రోజు తన ఛాలెంజ్ ను పూర్తి చేసాడు రానా.

హీరో నాని కి జోడీగా మరోసారి అదితి రావు హైదరి ?
హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ కొంత మిగిలివున్న ఈ మూవీ తరువాత నాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందనున్న "శ్యామ్ సింగ రాయ్ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపిక అయ్యారు.
బాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ- దశాబ్దం తర్వాత
డైరెక్టర్ సురేష్ కృష్ణ... ఈ పేరు ఇప్పుడు పెద్ద తెలియకపోవచ్చు కానీ రజినీ బాషా సినిమా డైరెక్టర్ అంటే మాత్రం టక్కున గుర్తొస్తాడు. రజినీ-సురేష్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రతి సినిమా లవర్ కీ తెలుసు. ఈ చిత్రంలోని బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అనే డైలాగ్, రజనీ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఉర్రూతలూగించడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాషా చిత్రం విజయానికి రజనీకాంత్ ఒక ఎత్తు అయితే.. మార్క్ ఆంథోనిగా రఘువరన్ విలనిజం సినిమాను మరో మెట్టెక్కించింది . సురేష్ కృష్ణ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సినిమాకు వెన్నెముకగా మారింది. దక్షిణాదిలో బాషా…
ఆ సినిమాలో రకుల్ లేనట్టే..!
చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు లవ్ స్టోరీ షూటింగ్ కూడా జరపుకుంది. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య - టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో కూడా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నిజానికి 'లవ్ స్టోరీ' సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'నాగేశ్వరరావ్' చేయవలసి వుంది. కానీ…
ఇంట్లో లేకపోతే 'మహేష్' అక్కడే.. నమ్రతా
సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డాన్ లో మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి చెప్పినట్టు నమ్రత గతంలో ఎప్పుడూ చెప్పింది లేదు. ఎప్పుడో ఒకసారి వారికి సంబంధించిన పోస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్ గా తీసిన పిక్స్ వీడియోస్ తో పాటు త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ ఇలా అన్నీ పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ గురించి మరో ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.

వెంకటేష్ 34 సంవత్సరాల సినీ జర్నీ
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ , ఖుష్బూ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "కలియుగపాండవులు " మూవీ 1986 సంవత్సరం ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీ తో వెంకటేష్ , ఖుష్బూ టాలీవుడ్ కు పరిచయం అవడం విశేషం. "స్వర్ణ కమలం ", "ప్రేమ ","బొబ్బిలిరాజా ", "శత్రువు ", "క్షణక్షణం ", "చంటి ", "సుందర కాండ ", "కొండపల్లి రాజా ", "అబ్బాయి గారు ", "ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు ", "ప్రేమించుకుందాం రా , "కలిసుందా రా ", "జయం మనదేరా ", "నువ్వు నాకు నచ్చావ్ ", "వసంతం ", ఘర్షణ ", ", లక్ష్మీ ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ", " "దృశ్యం ", "గురు ", "F…

"ఇంద్రప్రస్థం " మూవీ పోస్టర్ రిలీజ్
"మహాప్రస్థానం "మూవీ తో సంచలనం సృష్టించిన దర్శకుడు దేవా కట్టా మరో సంచలనానికి తెర తీశారు. ప్రోడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిమాణాల నేపథ్యం లో "నైతికత మారుతుంది , అధికారం కోసం జరిగే పోరాటం ఎప్పుడు స్థిరం గా ఉంటుంది " అనే క్యాప్షన్ తో పొలిటికల్ డ్రామా " "ఇంద్రప్రస్థం " మూవీ తెరకెక్కుతుంది.
మలయాళం రీమేక్ లో రాజశేఖర్..?
గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. అయితే ఆ మధ్య వీరభద్రమ్ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తెలిసింది. ఇక ఇటీవల నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
"అప్పట్లో ఒకడుండేవాడు" మూవీ హిందీ రీమేక్ ?
అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై నారా రోహిత్ , శ్రీవిష్ణు , తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో సాగర్ K చంద్ర దర్శకత్వంలో 1990 ల నాటి వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన క్రైమ్ , యాక్షన్ ఎంటర్ టైనర్ "అప్పట్లో ఒకడుండేవాడు" మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుందని సమాచారం.
నివేద థామస్ మనసులో మాట
"వెరుతే ఒరు భార్య " మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటి గా పరిచయం అయిన నివేద థామస్ , ఆ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ అవార్డ్ ను అందుకున్నారు . సక్సెస్ ఫుల్ "ప్రయాణం "మూవీ లో నటించిన నివేద "పోరాలి " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ "జెంటిల్ మన్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నిన్నుకోరి", "జై లవకుశ ", "118 ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో నివేద ప్రేక్షకులను అలరించారు.
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. అంతేకాదు మన తెలుగులో స్టార్ట్ అయిన ఈ ఛాలెంజ్ చిన్న చిన్నగా పక్కన ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది. తన పుట్టినరోజున గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్, శ్రుతీ హాసన్, ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసరగా ఇప్పటికే విజయ్ మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాడు. తాజాగా శ్రుతీహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించింది. తాజాగా చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటింది.

కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ
బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న సక్సెస్ ఫుల్ "కళత్తూర్ కన్నమ్మ " మూవీ లో బాల నటుడిగా కమల్ హాసన్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్ రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నారు. ఆ మూవీ 1960 సంవత్సరం ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నేటితో కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. సూపర్ హిట్ "అపూర్వ రాగంగళ్" మూవీ కమల్ హాసన్ కు బ్రేక్ నిచ్చిన మూవీ. దక్షిణాది భాషలతోపాటు హిందీ , బెంగాలీ భాషలలో కమల్ హాసన్ సుమారు 220 మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

'FEAR' కి కొత్త అర్ధం చెపుతున్న 'శీను'
విభిన్నమైన కథలతో తెలుగులో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ ఆంటోని అగ్ని సిరగుగల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి కూడా విదితమే. నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ అక్షర హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నాజర్, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో శర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జవ్వాజి రామాంజనేయులు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
డింపుల్ హయతి కి బాలీవుడ్ బిగ్ ఆఫర్
"గల్ఫ్ " మూవీ తో కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అయిన డింపుల్ హయతి "అభినేత్రి 2 ", "యురేక" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "గద్దలకొండ గణేష్ " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి డింపుల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన చంద్రమౌళి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న కన్నడ మూవీ తో డింపుల్ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. డింపుల్ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక బిగ్ ఆఫర్ అందుకున్నారు.