విభిన్నమైన కథలతో తెలుగులో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ ఆంటోని అగ్ని సిరగుగల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి కూడా విదితమే. నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ అక్షర హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా నాజర్, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో శర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జవ్వాజి రామాంజనేయులు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విజయ ఆంటోని ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసాడు. ఇందులో ఫియర్ అనే పదం ఉంది. అంతే కాదు దానికింద అన్నీ మరచిపోయి పరిగెత్తు లేక సమస్యను ఎదుర్కొని నిలబడు అనే అర్థం వచ్చేలా డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాలో శీను పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
#agnisiragugal #jwala #seenu pic.twitter.com/78yr8nAcac
— vijayantony (@vijayantony) August 11, 2020
ఇక ఈ సినిమాతో పాటు విజయ్ ఆంటోని ‘తమిళరసన్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా… కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇనాక్ బిచ్చగాడు సీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సీక్వెల్‌కు ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఆంటోని నిర్మిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: