‘ఆర్ఆర్ఆర్’ – ఎన్టీఆర్ టీజర్ పై రాజమౌళి క్లారిటీ

Director SSRajamouli Gives An Update About The Release Of NTR Teaser Release

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఫస్ట్ లుక్, ఇంట్రో వీడియో ఉంటుందని అనుకున్నారు కానీ కుదరలేదు. దానితో అభిమానులు కాస్త నిరాశకుగురయ్యారని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ ఇంట్రో వీడియోపై డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజమౌళి దీని గురించి మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రానున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, ఇంట్రో వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల కరోనా వైరస్ నుండి కోలుకోగా.. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు షూటింగ్‌కి వెళ్లకూడదని అనుకుంటున్నానని.. డాక్టర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. రెండు మూడు వారాల్లో షూటింగ్ మొదలుపెడతా.. ఎన్టీఆర్ టీజర్ కోసం.. కావాల్సిన విజువల్స్ కోసం ఎలా లేదనుకున్నా10 – 15 రోజుల టైం పడుతుందని చెప్పారు. మరి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, ఇంట్రో రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 11 =