హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ కొంత మిగిలివున్న ఈ మూవీ తరువాత నాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ లో మరో హీరోయిన్ గా అదితి రావు హైదరి ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అదితి రావు హైదరి హీరో నాని కి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ లో నటించారు. MCA మూవీ లో నాని కి జోడీగా నటించిన సాయి పల్లవి కి “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ రెండవ మూవీ కాగా అదితి రావు హైదరికి కూడా రెండవ మూవీ కావడం విశేషం. అదితి రావు ప్రస్తుతం రెండు తమిళ , ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు. సాయి పల్లవి “లవ్ స్టోరీ “, “విరాటపర్వం ” మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: