బాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ- దశాబ్దం తర్వాత

Baasha Movie Director Suresh Krishna All Set To Make A Comeback Soon

డైరెక్టర్ సురేష్ కృష్ణ… ఈ పేరు ఇప్పుడు పెద్ద తెలియకపోవచ్చు కానీ రజినీ బాషా సినిమా డైరెక్టర్ అంటే మాత్రం టక్కున గుర్తొస్తాడు. రజినీ-సురేష్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రతి సినిమా లవర్ కీ తెలుసు. ఈ చిత్రంలోని బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అనే డైలాగ్, రజనీ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఉర్రూతలూగించడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాషా చిత్రం విజయానికి రజనీకాంత్ ఒక ఎత్తు అయితే.. మార్క్ ఆంథోనిగా రఘువరన్ విలనిజం సినిమాను మరో మెట్టెక్కించింది . సురేష్ కృష్ణ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సినిమాకు వెన్నెముకగా మారింది. దక్షిణాదిలో బాషా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీ కెరీర్‌లో గొప్ప చిత్రంగా బాషా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సురేష్ కృష్ణ మెగా ఫోన్ పట్టనున్నట్టు తెలుస్తుంది. తెలుగు తమిళ్ లో పలు సినిమాలు తీసిన ఆయన దాదాపు దశాబ్దం పాటు ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఇప్పుడు మిర్చి శివతో ఆయన కొత్త సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

సూపర్ స్టార్ రజినీ కాంత్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆ స్టయిల్ తోనే గత 45 ఏళ్లుగా సినీ పరిశ్రమను ఏలుతున్నారు. ఇక ఆయన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వున్నాయి. వాటిలో బాషా సినిమా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 7 =