ఇంట్లో లేకపోతే ‘మహేష్’ అక్కడే.. నమ్రతా

Mahesh Babu will be here if he is not in the house says Namrata Shirodkar

సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డాన్ లో మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి చెప్పినట్టు నమ్రత గతంలో ఎప్పుడూ చెప్పింది లేదు. ఎప్పుడో ఒకసారి వారికి సంబంధించిన పోస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్ గా తీసిన పిక్స్ వీడియోస్ తో పాటు త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ ఇలా అన్నీ పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ గురించి మరో ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నమ్రత ఓ స్పెషల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహేష్ పర్‌ఫెక్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌.. మాస్టర్స్ డెన్ మహేష్ ఇంట్లో లేకపోతే కచ్చితంగా ఎక్కడ ఉంటారో తెలుసు.. ఇంట్లోని జిమ్‌లోనే రోజంతా గడపుతారు అని నమ్రత పేర్కొన్నారు. మరి ఫిట్ నెస్ పకు మహేష్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.

 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − six =