డింపుల్ హయతి కి బాలీవుడ్ బిగ్ ఆఫర్

Actress Dimple Hayathi Grabs Big Movie Offer In Bollywood.

“గల్ఫ్ ” మూవీ తో కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అయిన డింపుల్ హయతి “అభినేత్రి 2 “, “యురేక” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “గద్దలకొండ గణేష్ ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి డింపుల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1” కన్నడ మూవీ కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన చంద్రమౌళి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న కన్నడ మూవీ తో డింపుల్ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. డింపుల్ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక బిగ్ ఆఫర్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి – సిరీస్ , కలర్ యెల్లో ప్రొడక్షన్స్ , కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్ , అక్షయ్ కుమార్ హీరోలుగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “అత్రాంగి రే “హిందీ మూవీ రూపొందుతుంది. సారా అలీ ఖాన్ కథానాయిక. తమిళ స్టార్ హీరో ధనుష్ 3వ హిందీ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో దర్శకుడు ఆనంద్, ధనుష్ కు జోడీ గా డింపుల్ ను ఎంపిక చేశారు. ఈ మూవీ లో డింపుల్ విలేజ్ గర్ల్ గా నటించనున్నారు. రెండు , మూడు సినిమాలలో నటించిన డింపుల్ కు ఈ భారీ బాలీవుడ్ మూవీ లో అవకాశం రావడం అదృష్టమే కదా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =