“మహాప్రస్థానం “మూవీ తో సంచలనం సృష్టించిన దర్శకుడు దేవా కట్టా మరో సంచలనానికి తెర తీశారు. ప్రోడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిమాణాల నేపథ్యం లో “నైతికత మారుతుంది , అధికారం కోసం జరిగే పోరాటం ఎప్పుడు స్థిరం గా ఉంటుంది ” అనే క్యాప్షన్ తో పొలిటికల్ డ్రామా ” “ఇంద్రప్రస్థం ” మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
30 సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , వై ఎస్ రాజశేఖరెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా మారడం , అందుకు దారి తీసిన పరిస్థితులు , వాస్తవాలతోపాటు కొంత కల్పిత కథ తో “ఇంద్రప్రస్థం ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ టైటిల్ లోగో ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ .. పోటీ అనగా గెలుపు అని , ఇద్దరు స్నేహితులు రాజకీయాల ఆట బరి లో దిగినప్పుడు , ఆ ఆట మజాయే వేరని , అది అత్యంత ఆసక్తికరంగా మారుతుందని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: