లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. సినిమాల షూటింగ్లు జరుపుకోవచ్చు అని ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నా కరోనాకు భయపడి ఎవరూ పెద్దగా షూటింగ్ లకు వెళ్లట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకొచ్చి తక్కువమంది సిబ్బందితో.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సినిమా థియేటర్లలో బొమ్మ పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇక ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపించట్లేదు. మరో పక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుంజుకున్నాయి. మొదట చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో నాని ‘వి’ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, థియేటర్స్ గురించి దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా రాకముందు.. లక్డౌన్ లేకముందు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ బాగానే రన్ అయ్యాయి.. ఒకసారి వ్యాక్సిన్ వచ్చి థియేటర్స్ ఓపెన్ అయితే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్స్ కే వస్తారు.. ఎందుకంటే మన ఆడియన్స్ కు ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమానే.. థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఏది రీప్లేస్ చేయలేదు అని చెప్పారు.
మరి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు తెలుగు సినిమా అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాను పిచ్చిగా ప్రేమించే వాళ్ళు చాలా మందే వున్నారు. థియేటర్స్ ఓపెన్ చేయాలే కానీ వెళ్ళడానికి ఎంతోమంది రెడీగా వున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: