బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా

Bahubali Actor Rana Daggubati Accepts and Completes Green India Challenge

ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా నార్మల్ లైఫ్ లోకి వచ్చేసాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఛాలెంజ్ ను పూర్తి చేసి రానా కు కూడా ఛాలెంజ్ ను విసిరారు. శ్రుతీహాసన్ కూడా రానా ను నామినేట్ చేసింది. ఇక ఈ రోజు తన ఛాలెంజ్ ను పూర్తి చేసాడు రానా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొక్కలు నాటిన రానా ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాతిన రానా.. గ్రీన్ ఛాలెంజ్ లాంటి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డార్లింగ్ ప్రభాస్‌కు, శృతీహాసన్‌కు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో నా అభిమానులు, ప్రకృతి ప్రేమికులందరూ పాల్గొని ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలి. అంతేకాదు.. ఎవరు మొక్కలు నాటి నన్ను ట్యాగ్ చేసినా రీట్వీట్ చేస్తానని రానా తెలియజేశాడు.

 

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =