తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతారల ప్రేమ, పెళ్లి వ్యహారాలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. విఘ్నేష్ శివన్-నయనతారలు గత కొంత కాలంగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ గురించి కానీ.. రిలేషన్ షిప్ గురించి కానీ వీరిద్దరూ బహిరంగంగా చెప్పింది లేదు. అయితే అప్పుడుప్పుడు తమ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక అవి చూసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు అల్లేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా ఈవార్తలపై స్పందించిన విఘ్నేశ్ శివన్ పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్ శివన్ నయనతారతో పెళ్లి గురించి స్పష్టత నిచ్చారు. ఆయన మాట్లాడుతూ ‘సోషల్‌మీడియాలో ఇప్పటికే మా ఇద్దరికీ 22సార్లు పెళ్లి చేశారు. ప్రతి మూడు నెలలకొకసారి మాపెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.. ప్రస్తుతం మేమిద్దరం మాకెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నాం… మాకు డేటింగ్ పై బోర్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటాం.. మేము ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మా వివాహం గురించి ముందుగానే అందరికి తెలియజేస్తాం’ అని అన్నారు. మరి చూడబోతే ఈ వార్తలతో విఘ్నేష్ శివన్ కు బాగానే కోపమొచ్చినట్టు కనిపిస్తుంది. గట్టిగానే సమాధానం చెప్పాడు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో?లేదో? చూద్దాం.
ఇక ఈ ఏడాది దర్బార్ సినిమాలో రజినీకాంత్ కు జోడిగా నటించిన నయనతార.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు.. నయనతార ‘నేత్రికాన్’ ‘మూకుతి అమ్మన్’ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ సినిమాలోనూ కనిపించనుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: