గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. అయితే ఆ మధ్య వీరభద్రమ్ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తెలిసింది. ఇక ఇటీవల నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే.. 2018లో మలయాళంలో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జోసెఫ్ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక లు ఎంఎల్వి సత్యనారాయణ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్టు పని జరుగుతుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
ఇక ఈ సినిమా దర్శకుడు నిలకంఠ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.. ఆయన తెరకెక్కించిన ‘షో’, ‘మిస్సమ్మ’, ‘విరోధి’ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దీనితో రాజశేఖర్‌తో చేస్తున్న ఈ సినిమా కూడా వైవిథ్యంగా ఉంటుందన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబందించిన మిగితా నటీనటులు, టెక్నికల్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: