ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 39
స్టైలిష్ డైరెక్టర్ తో అఖిల్ మూవీ ?
అవుట్ సైడర్-ఇన్ సైడర్ కాదు.. టాలెంటే ముఖ్యం..!
బాలీవుడ్ కి 'వినాయకుడు'..!
నేనెంతో అదృష్టవంతుడిని..!
మాస్ టైటిల్ తో రవితేజ మూవీ ?

యంగ్ ఎమ్మెల్యే గా నవీన్ చంద్ర ?
'విక్రాంత్ రోణ' గా సుదీప్

"దూకుడు " మూవీ హిందీ రీమేక్
చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్

'చైసామ్' పిక్చర్ పర్ఫెక్ట్
'అమ్మ కోసం' చిరు చేపల వేపుడు
మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ రికార్డ్

ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!

కరోనా వార్తలపై వర్మ కౌంటర్..!
నేషనల్ అవార్డ్ విన్నర్ దర్శకత్వంలో రాజశేఖర్ మూవీ ?
సూపర్ హిట్ "ప్రతిఘటన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన Dr రాజశేఖర్ పలు మూవీస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించారు. యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజశేఖర్ హీరోగా రూపొందిన "ఆహుతి ", అంకుశం ", మగాడు ", "అల్లరి ప్రియుడు ", "అన్న", "గోరింటాకు "," PSV గరుడ వేగ" మూవీస్ ఘనవిజయం సాధించాయి.
'నిశ్శబ్దం' ..ఓటీటీ కావాలా? థియేటర్ లో కావాలా?
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీలోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారని అన్నారు..అయితే దీనిపై స్పందించిన చిత్రయూనిట్ అదేం లేదు థియేటర్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాం అని చెప్పారు.

స్పెషల్ సాంగ్ లో "రొమాంటిక్ "బ్యూటీ ?
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మోడల్ , యాక్ట్రెస్ , సింగర్ కేతిక శర్మ "రొమాంటిక్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కేతిక శర్మ మరో మూవీ ఆఫర్ అందుకున్నారు. సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వం లో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కేతిక శర్మ ఇప్పుడు మరో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.
స్టైలిష్ డైరెక్టర్ తో అఖిల్ మూవీ ?
కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని "సిసింద్రీ " మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అఖిల్ "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన అఖిల్ "హలో ", "Mr మజ్ను " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అవుట్ సైడర్-ఇన్ సైడర్ కాదు.. టాలెంటే ముఖ్యం..!
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని మరణించిన తర్వాత నేపోటిజం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రిటీస్ దీనిపై స్పందించారు. కొంతమందికి బంధుప్రీతి ఉంటుంది అంటే కొంత ఉంటే తప్పేంటి అని ఇలా ఎవరికి నచ్చిన వెర్షన్స్ వాళ్ళు వినిపించారు. ఇప్పుడు ఇక ఈ నేపోటిజంపై రకుల్ ప్రీత్ కూడా మాట్లాడుతూ తన అభిప్రాయం ఏంటో కూడా చెప్పుకొచ్చిది. అవుట్ సైడర్-ఇన్ సైడర్ ఇంకా ఇండస్ట్రీ నాన్ ఇండస్ట్రీ ఉంటుందని నేను అనుకోవట్లేదు.. ఏ ఇండస్ట్రీ అయినా ఎవరి కెరీర్ వాళ్లకి ఉంటుంది.. ఇండస్ట్రీలో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని అన్నారు. ఒక్కోసారి…
బాలీవుడ్ కి 'వినాయకుడు'..!
మన టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఇక్కడ హిట్ సినిమాల్లో ఏదో ఒకటో రెండో సినిమాలు అక్కడ రీమేక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలు రీమేక్ కు సిద్ధంగా ఉండగా ఇప్పుడు మరో సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదో కృష్ణుడు ప్రధాన పాత్రలో వచ్చిన 'వినాయకుడు' సినిమా.

ఇప్పటివరకూ ఆ రికార్డ్ 'దాన వీర సూర కర్ణ' సినిమాదే..!
సాధారణంగా ఒక సినిమా నిడివి ఎంత అంటే ఇప్పుడున్న వాళ్ళు టక్కున 2 గంటల 30 నిముషాలు అని చెప్పేస్తారు. దాదాపుగా ఇప్పుడున్నఅన్ని సినిమాలు 2.30 నిముషాలే నిడివి ఉంటుంది. ఏదో కొన్ని సినిమాలు మాత్రం 3 గంటలు తీస్తున్నారు. దానికే ఇప్పుడు అబ్బో 3 గంటలా.. ఎవరు చూస్తారు అని అంటారు. ఇప్పుడు ఇలా కానీ పాతతరంలో అన్ని సినిమాలు దాదాపు మూడు గంటలు నిడివి ఉండేవి. ఇక నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు దాన వీర శూర కర్ణ సినిమా అయితే ఏకంగా 4 గంటల 17 నిముషాలు ఉంటుంది. ఇక ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రతి సినిమా ప్రేక్షకుడికి తెలుసు.
నేనెంతో అదృష్టవంతుడిని..!
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోకు ఎలాంటి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారో తెలుసు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తమ ట్విట్టర్‌లో #HBDMaheshBabu హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఇక ఈ ట్యాగ్ 60.2 మిలియన్ ట్వీట్స్‌తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఇంకా టాలీవుడ్ నుండి ఎంతోమంది సెలెబ్రిటీస్ మహేష్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మాస్ టైటిల్ తో రవితేజ మూవీ ?
మాస్ మహారాజా రవితేజ ప్రతీ సినిమాలో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ నటించిన మూవీస్ జయాపజయాలతో సంబంధంలేకుండా రవితేజ పై క్రేజ్ ఉన్న ప్రేక్షకులు ఆయన నటనను ఆస్వాదిస్తారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తోపాటు రవితేజ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

యంగ్ ఎమ్మెల్యే గా నవీన్ చంద్ర ?
సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర తెలుగు మూవీస్ తో పాటు తమిళ మూవీస్ లో కూడా నటించారు. సూపర్ హిట్ "నేను లోకల్ " మూవీ తో గుర్తింపు పొందిన నవీన్ చంద్ర సూపర్ హిట్ "అరవింద సమేత వీర రాఘవ" మూవీ లో బాల్ రెడ్డి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో అనే కాకుండా నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను నవీన్ చంద్ర ఎంపిక చేసుకుంటున్నారు.
'విక్రాంత్ రోణ' గా సుదీప్
అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఫాంటమ్ కన్నడ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వల్ల గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించినట్టు సుదీప్ తెలిపాడు. కరోనా వల్ల ఇన్నిరోజులు షూటింగ్ కు దూరంగా ఉన్నానని.. చాలా రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభం అయ్యింది.

"దూకుడు " మూవీ హిందీ రీమేక్
ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. సౌత్ మూవీస్ ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇంతకు ముందు తెలుగు "పోకిరి " మూవీ "వాంటెడ్ ", "విక్రమార్కుడు " మూవీ "రౌడీ రాథోడ్ "గా హిందీ భాషలో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి. "అర్జున్ రెడ్డి " హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు తెలుగు మూవీస్ ను హిందీ భాషలో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రీమేక్ మూవీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.
చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్
"ప్రాణం ఖరీదు" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరించారు. కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసి మెగా స్టార్ గా మారి చిరంజీవి టాలీవుడ్ లో తిరుగు లేని హీరోగా రాణిస్తున్నారు. 149 సినిమాలలో నటించిన చిరంజీవి పొలిటికల్ పార్టీ "ప్రజారాజ్యం " ను స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు. సుమారు 10 సంవత్సరాల తరువాత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా "ఖైదీ నెం 150 "రూపొందింది. ఆ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో చిరంజీవి స్టామినా ను నిరూపించింది.

'చైసామ్' పిక్చర్ పర్ఫెక్ట్
గత మూడు నాలుగు రోజుల నుండి రానా-మిహికా ల పెళ్లి సందడి చూస్తూనే ఉన్నాం. హల్దీ ఫంక్షన్, మెహందీ, పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. మొత్తానికి నిన్న రాత్రి రానా- మిహికాల వివాహం రామానాయుడు స్టూడియోలో అతికొద్ది సన్నిహితుల మధ్య జరిగిపోయింది. ఇక ఈ వివాహానికి సమంతా, నాగ చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసనలు కూడా హాజరయ్యారు. ఇక వీరికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ పెళ్లి సందడి మొదలైనప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నో ఫొటోలు బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఒక ఫొటోకు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటో ఎవరిదో కాదు నాగ చైతన్య-సమంతది.

హన్సిక "మహా " మూవీ కొత్త పోస్టర్ రిలీజ్
ఎట్సెట్రా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యు ఆర్ జమీల్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో "మహా " తమిళ మూవీ రూపొందుతుంది. థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో తమిళ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "మహా " మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "మహా " మూవీ సంగీత దర్శకుడు గిబ్రాన్ కు 25 వ మూవీ కావడం విశేషం.
'అమ్మ కోసం' చిరు చేపల వేపుడు
లాక్ డౌన్ లో చిరు ఇంట్లో ఉంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు తన పోస్ట్‌లతో నెటిజన్స్‌కి కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ పలు వీడియోలు సూచనలు ఇస్తూనే పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు వంటలు కూడా చేస్తున్నాడు. గతంలో తన తల్లికి దోశలు ఏసిపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మరోసారి తనతల్లి కోసం మరో వంటను చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వంట ఏదో కాదు చేపల వేపుడు.
మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ రికార్డ్
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న తన బర్త్ డే ను జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యం లో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని మహేష్ బాబు అభిమానులను కోరారు. దీంతో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను భారీగా ట్రెండ్ చేశారు.

ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!
మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ పుట్టినరోజు అయిపోయింది. ఈ సందర్భంగా మహేష్ కోరిక మేరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ తఢాకా చూపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ' సర్కారు వారి పాట' సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి గిఫ్ట్ ఇవ్వగా.. ఫ్యాన్స్ కూడా మహేష్ కు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు పుట్టిన రోజు హ్యాష్ టాగ్ ను వైరల్ చేశారు. ఈ ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో పాటు.. వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్‌గా కాకుండా ఏకంగా వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది…

కరోనా వార్తలపై వర్మ కౌంటర్..!
ఈమధ్య టాలీవుడ్ సెలబ్రిటీస్ వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్న వాళ్లకు కూడా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజమౌళి నుండి మొదలుపెట్టగా ఇప్పటివరకూ చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు కూడా కరోనా వచ్చిందంటూ వార్తలు విన్పిస్తున్నాయి. మరి సైలెంట్ గా నాకు రాలేదు అని చెపితే వర్మ ఎందుకు అవుతాడు. ఎప్పటిలాగే తన ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ చేతిలో డంబెల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ కౌంటర్ వేసాడు వర్మ.
'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్
తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచినా తన కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.