మూడు భాగాలు , మూడు టైటిల్స్ తో ఆర్ జి వి బయోపిక్

Director Ram Gopal Varma To Make His Biopic In Three Parts

సంచలన చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన చిత్రానికి తెర తీశారు. దర్శకుడు ఆర్ జి వి కి వ్యతిరేకంగా పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆర్ జి వి ఇప్పుడు ఎవరో తన మీద సినిమాలు రూపొందిందించటం ఏంటని , తన బయోపిక్ ను మూడు భాగాలు , మూడు టైటిల్స్ తో నిర్మించడానికి ప్లాన్ చేశారు. తన బయోపిక్ మూవీ వివరాలను ఆర్ జి వి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బొమ్మాకు క్రియేషన్స్ బ్యానర్ పై దొర సాయి తేజ దర్శకత్వంలో ఆర్ జి వి బయోపిక్ మూవీ మూడు పార్ట్ లు గా రూపొందనుంది. మొదటి పార్ట్ కు “రాము “, రెండవ పార్ట్ కు “రామ్ గోపాల్ వర్మ “, మూడవ పార్ట్ కు “ఆర్ జి వి” టైటిల్స్ ఫిక్స్ చేశారు. మొదటి పార్ట్ “రాము ” మూవీ లో వర్మకాలేజ్ రోజులు , గ్యాంగ్ వార్ , “శివ “మూవీ వంటి అంశాలు ఉంటాయి. ఒక కొత్త నటుడు వర్మ పాత్రలో నటిస్తారు. రెండవ పార్ట్ “రామ్ గోపాల్ వర్మ “మూవీ లో ముంబై బ్యాక్ డ్రాప్ , అండర్ వరల్డ్ ప్రేమాయణం , గ్యాంగ్ వార్స్ వంటిఅంశాలతో తెరకెక్కనుంది . ఈ మూవీ లో వర్మ గా మరో నటుడు నటిస్తారు. ఇక మూడవ పార్ట్ “ఆర్ జి వి” మూవీ లో వర్మ పరాజయాలు , కాంట్రవర్సీ వంటి అంశాలతో తెరకెక్కనుంది. ఈ మూవీ లో హీరోగా వర్మ నటించడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =