వెంకటేష్ 34 సంవత్సరాల సినీ జర్నీ

Victory Venkatesh Completes 34 Years Of His Film Journey In Tollywood.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ , ఖుష్బూ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “కలియుగపాండవులు ” మూవీ 1986 సంవత్సరం ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీ తో వెంకటేష్ , ఖుష్బూ టాలీవుడ్ కు పరిచయం అవడం విశేషం. “స్వర్ణ కమలం “, “ప్రేమ “,”బొబ్బిలిరాజా “, “శత్రువు “, “క్షణక్షణం “, “చంటి “, “సుందర కాండ “, “కొండపల్లి రాజా “, “అబ్బాయి గారు “, “ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు “, “ప్రేమించుకుందాం రా , “కలిసుందా రా “, “జయం మనదేరా “, “నువ్వు నాకు నచ్చావ్ “, “వసంతం “, ఘర్షణ “, “, లక్ష్మీ “, “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే “, ” “దృశ్యం “, “గురు “, “F 2 “, “వెంకీ మామ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో వెంకటేష్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏ క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించే వెంకటేష్ ఈ రోజు తో 34 సంవత్సరాల జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. తెలుగు , హిందీ భాషలలో సుమారు 72 సినిమాలలో నటించి వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గా 7 నంది , 6ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. హీరో వెంకటేష్ 34 సంవత్సరాల సినీ జర్నీ సందర్భంగా వెంకటేష్ నటించిన ఐకానిక్ క్యారెక్టర్స్ తో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. హీరో వెంకటేష్ ప్రస్తుతం “నారప్ప “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తమిళ సూపర్ హిట్ “అసురన్ ” మూవీ కి తెలుగు రీమేక్ మూవీ గా రూపొందుతుంది. టాలీవుడ్ లో 34 సంవత్సరాల సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్న సీనియర్ హీరో వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలుపుదాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 11 =