కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ

Universal Hero Kamal Haasan Completes 61 Years Of His Illustrious Film Journey Today.

బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న సక్సెస్ ఫుల్ “కళత్తూర్ కన్నమ్మ ” మూవీ లో బాల నటుడిగా కమల్ హాసన్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్ రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నారు. ఆ మూవీ 1960 సంవత్సరం ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నేటితో కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. సూపర్ హిట్ “అపూర్వ రాగంగళ్” మూవీ కమల్ హాసన్ కు బ్రేక్ నిచ్చిన మూవీ. దక్షిణాది భాషలతోపాటు హిందీ , బెంగాలీ భాషలలో కమల్ హాసన్ సుమారు 220 మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నాయకన్ “, “పుష్పక విమాన “, “అపూర్వ సహోదరగళ్”, దేవర్ మగన్ “, “ఇండియన్ “, “అవ్వై షణ్ముఖి “, “సతి లీలావతి “, “వసూల్ రాజా ఎంబిబిఎస్ “, దశావతారం “, “విశ్వరూపం “, “విశ్వరూపం 2” (తమిళ ), “మరో చరిత్ర “, “ఆకలిరాజ్యం “, “సాగరసంగమం “, “స్వాతి ముత్యం “,”ఇంద్రుడు చంద్రుడు “, “ఇది కథ కాదు “(తెలుగు ), “సాగర్ “, “సద్మా “, చాచి 420 “, ఏక్ దూజే కేలియే “(హిందీ ) మూవీస్ కమల్ హాసన్ సినీ జర్నీ లో మైలురాళ్ళు గా నిలిచాయి. బెస్ట్ యాక్టర్ గా 4 నేషనల్ , 19 ఫిల్మ్ ఫేర్ , 3 నంది అవార్డ్స్ కమల్ అందుకున్నారు. యాక్టర్ , సింగర్ , డ్యాన్సర్ , నిర్మాత , దర్శకుడు గా 6 దశాబ్దాలుగా సినీ కళామతల్లి కి సేవలు అందిస్తున్న సకల కళా వల్లభుడు కమల్ హాసన్ ను
“పద్మశ్రీ “, “పద్మ భూషణ్ ” పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. సూపర్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం సూపర్ హిట్ “ఇండియన్ “మూవీ సీక్వెల్ “ఇండియన్ 2 “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =