ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 33
'సోషల్ డైలమా' అన్నిటికంటే భయంకరం అంటున్న మహేష్
'RRR' - భీమ్ సర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్
అలియాపై క్లారిటీ తో రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు మా వంతు
హీరో రవితేజ మూవీలో హీరోయిన్స్
పవన్ తో సుదీప్ భేటీ

"రొమాంటిక్ " మూవీ అప్ డేట్
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
"మోసగాళ్ళు " మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రాజశేఖర్
థియేటర్ లో మొదటి సినిమా నాదే
పెళ్లి ఫొటో తో మామను స్మరించుకున్న చిరు
పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మన హీరోలదే
ప్రతీ సినిమాను ఛాలెంజ్ గా తీసుకొంటా -తమన్నా
'విష్ణు' స్కామ్ లో బన్నీ హ్యాండ్
షూటింగ్స్ తో బిజీగా నభా నటేష్
యువ దర్శకులతో హీరో నాని మూవీస్
నా కలలు నిజమయ్యాయి.. నా బాస్ ఓకే చెప్పారు
బిజీ బిజీగా తమన్నా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ లుక్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "అల్లుడు శీను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మూవీస్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస మూవీస్ తో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో సాయి శ్రీనివాస్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత సాయి శ్రీనివాస్ , రమేష్ వర్మ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ "మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
'సోషల్ డైలమా' అన్నిటికంటే భయంకరం అంటున్న మహేష్
అప్పుడప్పుడు తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన పుస్తకాలను చదవమని.. అలాగే సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి కానీ మహేష్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. గతంలో 'ఎమోషనల్ ఇంటెలిజన్స్' పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘డార్క్’ అనే పేరుతో తెరకెక్కిన జర్మన్ వెబ్ సిరీస్‌ను చూశానని, రచన, దాన్ని తీసిన తీరు అత్యద్భుతంగా ఉన్నాయని.. ఆ వెబ్ సిరీస్‌ను చూడాలంటూ తను రెకమండ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు మరో సినిమా గురించి మహేష్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
'RRR' - భీమ్ సర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్
మొత్తానికి ఏ సినిమా అప్ డేట్ కోసం.. ఏ సినిమా షూటింగ్ కోసం ఇన్ని రోజులు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో ఐడియా వచ్చింది కదా. ఇంకేంటి దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా. ఈ సినిమా అప్ డేట్ ఇస్తామని మేకర్స్ నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. కరోనా వల్ల మార్చి నుండి షూటింగ్ ను జరపలేదని.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశామని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోలో గేట్స్ తెరవడం, దుమ్ము పట్టిన వస్తువులను దులపడం, లొకేషన్ పరిసరాలని శుభ్రపరచడంకు సంబంధించిన…
అలియాపై క్లారిటీ తో రాజమౌళి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపోటిజమ్ పై ఎన్ని చర్చలు జరిగాయో.. జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ నెపోటిజమ్ అనే కాన్సెప్ట్ వల్ల కొంతమంది బాలీవుడ్ వారసులు కూడా టార్గెట్ అయ్యారన్న సంగతి కూడా తెలుసు. అందులో ముఖ్యంగా అలియా బట్ కూడా ఒకరు. సడక్ 2 కు వచ్చిన డిస్ లైక్స్ ను చూస్తేనే చెప్పొచ్చు పాపం అలియా పై ఎంత ట్రోలింగ్ జరిగిందో. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కూడా అలియా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాజమౌళి అలియా ప్లేస్ లో ఇంకే హీరోయిన్ ను రీప్లేస్ చేయనని చెపుతున్నాడు.
'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు మా వంతు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది.
హీరో రవితేజ మూవీలో హీరోయిన్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటన లతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "క్రాక్ " మూవీ తరువాత రవితేజ , సక్సెస్ ఫుల్ "రాక్షసుడు " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా "అల్లుడు అదుర్స్ " మూవీ రూపొందుతుంది .
పవన్ తో సుదీప్ భేటీ
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కన్నడ స్టార్ హీరో సుదీప్ కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందో కర్నాటకలో సుదీప్ కి అంత ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా కోసం వీరిద్దరూ భేటీ అయ్యారా..? నార్మల్ గానే భేటీ అయ్యారా? అని ఇప్పటికే పలు వార్తలు వచ్చేసాయి. అయితే వీరిద్దరూ క్యాజువల్ గానే మీట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు ఇద్దరూ సినిమాలు.. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్స్ చేయడం.. ఇంకా సామాజిక అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం. మరి ఎందుకు కలిసారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

"రొమాంటిక్ " మూవీ అప్ డేట్
పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"రొమాంటిక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మోడల్ కేతిక శర్మ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మందిరా బేడీ , మకరంద్ , దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అందించారు.
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రేక్షకులను అలరించి మీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు. పలు భాషల మూవీస్ కు మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మీనా , రజనీకాంత్ "అన్నాత్తే "(తమిళ ), మోహన్ లాల్ "దృశ్యం 2 " మూవీస్ లో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలోమోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మలయాళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. "దృశ్యం "మూవీ పలు భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
"మోసగాళ్ళు " మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ వాస్తవ సంఘటన నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. కాజల్ అగర్వాల్ , సునీల్ శెట్టి , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ CS సంగీతం అందిస్తున్నారు. "మోసగాళ్ళు " మూవీ జూన్ 5వ తేదీ రిలీజ్ కావాల్సివుండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రాజశేఖర్
యాంగ్రీ యంగ్ మెన్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రాజశేఖర్ ప్రేక్షకులను అలరించారు. హీరో రాజశేఖర్ ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
థియేటర్ లో మొదటి సినిమా నాదే
మొత్తానికి థియేటర్లు తెరుచుకునే టైం వచ్చేసింది. లాక్ డౌన్ వల్ల గత 8 నెలల నుండి థియేటర్స్ మూతపడే ఉన్నాయి. లాక్ డౌన్ తీసినా కూడా థియేటర్స్ కు మోక్షం రాలేదు ఇన్ని రోజులు. ఇక ఎంతో మంది సినీ లవర్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీకే కాదు.. సినీ లవర్స్ కు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50 % సిట్టింగ్ తో తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో కొన్ని నెలల తర్వాత మళ్ళీ ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తమ సినిమాలను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
పెళ్లి ఫొటో తో మామను స్మరించుకున్న చిరు
ఈ రోజు అల్లు రామలింగయ్య 99వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా అల్లు, మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులందరూ ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు గుర్తుగా అల్లు స్టూడియోస్ ను నిర్మించనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లుడు మెగా స్టార్ చిరంజీవి కూడా మామయ్యను సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు.
పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మన హీరోలదే
ఒకప్పుడు లాగ కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. యంగ్ హీరోస్ అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ తోడుగా వుంటున్నారు. అంతేకాదు ఒకరి సినిమా ప్రమోషన్స్ లో మరొకరు పాల్గొంటూ అటు సినిమాకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా.. ఫ్యాన్స్ కు కూడా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.. మీరు కూడా ఫ్రెండ్లీ గా ఉండాలని పరోక్షంగా చెపుతున్నారు. ఇండస్ట్రీలో మహేష్ – తారక్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్, గోపి చంద్ – ప్రభాస్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ – ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.. మంచు మనోజ్ అయితే అందరి కుర్ర హీరోలతో ఫ్రెండ్లీ గా ఉంటాడు. ఇంకా ఇలాంటి ఫ్రెండ్ షిప్పులు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.
ప్రతీ సినిమాను ఛాలెంజ్ గా తీసుకొంటా -తమన్నా
15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ఫస్ట్ టైమ్ కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో తమన్నా "బోలే చూడియన్ " మూవీ లో నటిస్తున్నారు. "గుర్తుందా శీతాకాలం " మూవీ కి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీ "అంధాధున్"తెలుగు రీమేక్ మూవీ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.
'విష్ణు' స్కామ్ లో బన్నీ హ్యాండ్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేశారు.
షూటింగ్స్ తో బిజీగా నభా నటేష్
సూపర్ హిట్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. "నన్ను దోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని గుర్తింపు పొంది పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.
యువ దర్శకులతో హీరో నాని మూవీస్
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలోరూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది."టక్ జగదీష్ " మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. "టక్ జగదీష్ " మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీ వాలా " మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా చారిత్రాత్మక నేపథ్యం లో "శ్యామ్ సింగ రాయ్ " మూవీ తెరకెక్కనుంది.
నా కలలు నిజమయ్యాయి.. నా బాస్ ఓకే చెప్పారు
గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్, బండ్లగణేశ్ కాంబినేషన్‌లో ఇది వరకు తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలు వచ్చాయి. 2015లో విడుదలైన టెంపర్ సినిమా తర్వాత బండ్లగణేశ్ మరో సినిమాను నిర్మించలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. చాలా గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత బండ్లగణేష్ మళ్లీ నిర్మాతగా మారబోతున్నాడు.
బిజీ బిజీగా తమన్నా
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు . 6నెలల విరామం తరువాత తమన్నా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.